నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు చేస్తే చర్యలు తప్పవు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీకృష్ణ
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపి ఎంపీలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీకృష్ణ తెలిపారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో ఆర్ఎంపి పిఎంపి వైద్యులు తో అత్యాశవాసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ ప్రాథమిక చికిత్సలు రోగికి అందించాలని ప్రభుత్వ నిబంధన ప్రకారం మాత్రమే చికిత్సలు అందించాలని తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఆర్ఎంపీలు పీఎంపీలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టమొచ్చిన రీతిలో వైద్య సేవలు అందిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.ఇకముందు అలాంటి వాటిని మానుకోవాలని తెలిపారు. ప్రథమ చికిత్స అని మాత్రమే బోర్డు పెట్టుకోవాలని క్లినిక్లు ఆస్పత్రులు అని బోడు ఉండకూడదని తెలిపారు పేరుకు ముందు డాక్టర్ అని పదం వాడొద్దని ఇలా వాడినట్లయితే జట్టరితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. చాలామంది ఆర్ఎంపీ పిఎంపి వైద్యులు బ్లడ్ టెస్ట్ లు ఎక్స్రేలు ఈసీజీలు రాస్తున్నారని అలాంటి తప్పు చేయవద్దని తెలిపారు కొందరు ల్యాబ్లు ఫార్మసీలను ఏర్పాటు చేసుకున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఏది ఏమైనాప్పటికీ నిబంధనలు పాటిస్తూ రోగులకు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని మరోసారి ఆర్ఎంపీపీ ఎంపీ వైద్యులకు వివరించారు. ఎప్పటికప్పుడు తనతో పాటు జిల్లాలో ఉన్న ఆయా ప్రోగ్రాం అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు ఆర్ఎంపీ పి.ఎం.పి క్లినిక్ లపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ తనిఖీల్లో తప్పు చేసినట్లు నిర్ధారణ అయినట్లయితే వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మీరు పని చేసే గ్రామాల్లో పారిశుద్ధంపై అవగాహన ప్రజలకు కల్పించాలని తెలిపారు దోమలు ఈగలు ఉన్నట్లయితే ఎలాంటి వ్యాధులు వస్తాయో కూడా ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత మాతో పాటు మీపై కూడా ఉందని తెలిపారు. ఫస్ట్డ్ చేసిన తర్వాత రోగులను దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గాని ప్రభుత్వ ఆసుపత్రి గాని పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాధన డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాధన, జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి మరియు జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్టపల్లివార్, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్ఎంపీపీ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.