ఎన్సిడి శిబిరంలో క్యాన్సర్ పరీక్షలు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
కోరుట్ల,(ఆరోగ్యజ్యోతి): నాన్ కమ్యూనిబుల్ డిసీస్ ఎన్సిడి కార్యక్రమంలో భాగంగా కోరుట్ల లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అల్లమయ్య గుట్ట లో వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాదాపు ఈ శిబిరంలో 50 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అనుమానం వచ్చిన వెంటనే క్యాన్సర్ పరీక్షలు ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ జమున సూపర్వైజర్ మసీద్ ల్యాబ్ టెక్నీషియన్ శ్రావణి ఏఎన్ఎం శారద తదితరులు పాల్గొన్నారు.