పిల్లలకు అంగన్వాడి సెంటర్లలో పౌష్టిక ఆహారం సక్రమంగా అందించాలి
ఎడిటర్ కే నరేష్ కుమార్ 9848025451
భీంపూర్,(ఆరోగ్యజ్యోతి): అంగన్వాడి సెంటర్ కు వచ్చే పిల్లలకు తల్లులకు మంచి పౌష్టికాహారం అందించాలని సిడిపిఓ సురేఖ, హెల్త్ సూపర్వైజర్ మేఘా, ఎస్ సి డి పి ఓ పి నరసమ్మ సూపర్వైజర్ ముంతాజ్ బేగం, హెల్త్ అసిస్టెంట్ జనాభాయ్లు అన్నారు. భీంపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ రెండులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిల్లల ఎత్తు బరువు తోపాటు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ కు వచ్చే పిల్లలకు పౌష్టికారం సక్రమంగా అందించాలని తెలిపారు పౌష్టికాహారం లోపం వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ప్రభుత్వం పిల్లలు బలంగా ఉండేందుకు సరైన పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు అంతేకాకుండా గర్భిణీలకు కూడా పౌష్టికాహారం అందించాలని తెలిపారు. సెంటర్ కు వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అంగన్వాడి సెంటర్లో ఇచ్చే పౌష్శికారం వల్ల పిల్లలు గర్భిణీలు బలంగా తయారవుతాయని తెలిపారు. ప్రస్తుతం అంగన్వాడి సెంటర్లో కార్పొరేట్ స్కూల్ కంటే మంచి స్థాయిలో ఉన్నాయని తెలిపారు తల్లిదండ్రులందరూ చిన్నారులను అంగన్వాడి సెంటర్కు పంపించాలని వారు సూచించారు.