వర్షాకాలం వ్యాధులు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు అవసరం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
వర్షాకాలం దృష్ట్యా ముందస్తూ ప్రణాళికలలో బాగంగా ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ పరిధిలోని అన్ని గ్రామాలలో "జాతీయ కీటక జనిత ఆరోగ్య అవగాహన కార్యక్రమం" ,ర్యాపిడ్ ఫీవర్ సర్వే,మరియు వైద్య శిబిరం బంద్ర గ్రామంలో నిర్వహించి 15 మందిని పరిరక్షించి ముందులను అందించామని,బాలుర ఆశ్రమ పాఠశాల"అంతర్బంద్" యందు 121 పిల్లలను ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన పిల్లలకు మందులను అందించడం జరిగిందని, 2-రక్తపరీక్షలు,7 - పిల్లలను రెఫల్ చేయడంతో పాటు క్లోరినేషన్ చేసిన నీటిని గాని, కాచి చల్లార్చిన నీటిని త్రాగడానికి వినియోగం చేయాలని,వేడి,వేడి ఆహారపదార్థాలను బుజించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని,నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని,నిల్వ నీటిపై మూతలను ఉంచాలని, ఆంటి లార్వల్ రసాయనాన్ని మురికి నీటి, మంచినీటి నిల్వలపై పిచికారి చేయించడం జరిగిందని,"స్టాప్ డయోరియా " కార్యక్రమం నిర్వహించడం తో పాటు జ్వరం, నీళ్ళ విరేచనాలు వచ్చిన వెంటనే ఆశా కార్యకర్తలను, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించి పరీక్షలు చేయించుకోని వైద్యాధికారి సూచనలతో మందులను సక్రమంగా వినియోగించుకోవాలని మండల వైద్యాధికారి డా" నిఖిల్ రాజ్, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ లు తెలిపారు, ఈకార్యక్రమంలో రాష్ట్రీయ బాల శిశు కార్యక్రమ డా"కృష్ణవేణి, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, యం.యల్.హెచ్.పీలు ఏ.సాహితి, మాయావతి, గ్రామపంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ ఆరోగ్య కార్యకర్తలు నఫీజ , విజయలక్ష్మి, సరస్వతి, జానాబాయ్, గోదావరి, భాగ్యవతి,పార్వతి, అంగన్వాడీ కార్యకర్తలు ,ఆశా కార్యకర్తలు దేవుబాయ్ ,దృపధ,సీతమ్మ,నంద,రణిత , స్వప్న సంగీత, శకుంతల, ఇందిర, జయమాల, గుణాదేవి గ్రామపంచాయతీ ధన్రాజ్,అవినాష్, శ్రీనివాస్,సిబ్బంది పాల్గొన్నారు.