ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన NHM ఉద్యోగులు ఎమ్మెల్యే కూనంనేని,ఏఐటీయూసీ సంఘం నాయకులు...
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి కి ఎమ్మెల్యే కూనమనేని ఆధ్వర్యంలో వినతి పత్రం
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందర్నీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ హెల్త్ మిషన్లో ఉద్యోగులు పనిచేస్తున్నారని చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్ దగ్గర ఉన్నారని వీరందరినీ రెగ్యులర్ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17,514 మంది నేషనల్ హెల్త్ మిషన్లో పని చేస్తున్నారని ముఖ్యమంత్రి వివరించారు. ఈ వినతి పత్రం కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహ కూడా ఉన్నారు. దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు పంజాబ్ మణిపూర్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అల్ క్యాడర్ ఉద్యోగులందరి రెగ్యులర్ చేశారని తెలంగాణలో మాత్రం ఇంతవరకు రెగ్యులర్ చేయలేదని ముఖ్యమంత్రి వివరించారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులుకు 510 జీవోలో మిస్ అయిన వారందరినీ వెంటనే న్యాయం చేయాలని చెప్పడంతో ముఖ్యమంత్రి స్పందించారు అన్ని రాష్ట్రాల నుంచి జీవోలు తెప్పించి పరిశీలించిన తర్వాత సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు.