ప్రభుత్వ నిబంధన మేరకే ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయాలి - రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటరెడ్డి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 వార్తలు పంపించండి.
హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ఆర్.ఎం.పి ఎంపీ వైద్యులు చికిత్సలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి పిఎంపి పట్టణ గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం రోజు అశోక్ నగర్ అభినందన గ్రాండ్ హోటల్ బ్యాంక్ హాల్లో టి.ఆర్.పి.ఎస్.ఆర్.ఎం.పి.ఎం.పి గ్రేటర్ హైదరాబాద్ శేర్లింగంపల్లి పటాన్చెరు రాజేంద్రనగర్ కూకట్పల్లి నియోజకవర్గాల డివిజనల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎంపీపీ ఎంపీ వైద్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మెరకే చికిచలు అందించాలని తెలిపారు. ప్రతి క్లినిక్ ను ప్రథమ చికిత్స కేంద్రం అని రాయాలని మన పేరుకు ముందు డాక్టర్ అని రాయవద్దని తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపీ పి ఎం పి వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ప్రధానం చేశారని అప్పట్నుంచి ఇప్పటివరకు ట్రైనింగ్ లేవని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎంపి పిఎంపి వైద్యులకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పారని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అని వారు పేర్కొన్నారు. ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జీవో నెంబర్ 429 ఇచ్చి ఆర్ఎంపి పి.ఎం.పి వైద్యులను గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎంపి పిఎంపి వైద్యులకు శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఇది సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45000 మందికిపైగా ఆర్ఎంపి పిఎంపులు వైద్యులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో 400 పైగా ఆర్ఎంపి పిఎంపి వైద్యులు హాజరయ్యారని తెలిపారు అంతేకాకుండా వందమందికి పైగా మహిళ ఆర్.ఎం.పి పిఎంపి వైద్యులు హాజరై రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ప్రతి ఆర్ఎంపి పిఎంపి వైద్యులకు న్యాయం చేయి చింతవరకు పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపి వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలోడా. ఖాన్ సాబ్, డా. పాషా డా. విద్యాసాగర్, డా. జాఫర్, డా.p. శ్రీనివాస్, డా. చారీ, డా. సంగమేష్,డా. శివరాజ్, డా. అనిల్ హాజరై తీర్మానం చేసినారు!! మహిళా వైద్యులు డాక్టర్ నందిని, డాక్టర్ సునీత, డాక్టర్ గీత, డాక్టర్ సుజాత, తదితరులు హాజరయ్యారు