డైటీషియన్ పదోన్నతుల లిస్టు పెట్టడంలో అధికారులకు ఇంత హడావిడి ఎందుకు
ఎడిటర్ కే నరేష్ కుమార్ 9848025451
- హడావిడిన డైటీషియన్ లిస్టు పెట్టడం ఎందుకు
- ముఖ్యమంత్రి గారు జర డైటీషియన్ పదోన్నతుల పోస్టులపై దృష్టి పెట్టండి
- డి ఎం ఈ లో డీడీలు సెలవు పెట్టిన వారి సంతకాలు లేకుండానే పదోన్నతులు
- ప్రభుత్వ పర్మిషన్ లేకుండానే డైటీషియన్ ఉన్నత చదువులో వెళ్లిన వారి పర్మిషన్ లెటర్లు అభ్యర్థులు ఒక్కరోజులో ఇవ్వడం సాధ్యమేనా?..
- ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్టులు డి ఎం ఎం హెచ్ ఓ సంతకం తో పాటు సీనియర్ అసిస్టెంట్ సూపర్డెంట్ సంతకం కూడా లెటర్ లో ఉండాలి
- సెప్టెంబర్ నెల 30 లోపు లిస్టు పెట్టాలని కోర్టు తీర్పు... అయినా అధికారుల హడావుడి ఎవరికోసం!..
- డిఎంఈలో డైటీషియన్ పదోన్నతుల లిస్టులో చక్రం తిప్పుతున్న అధికారి ఎవరు?... డీడీలు లేకుండానే లిస్టు పెట్టవచ్చా?...
- అనుమానాలతోనే డైటీషియన్ పదోన్నతుల జాబితా...
- ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఉద్యోగుల పర్మిషన్ లెటర్ పై సంతకాలు ఓకేనా... లేక అప్పటికప్పుడు తీసుకు వచ్చినవా..
- ఒకే యూనివర్సిటీ నుంచి చదివినట్టు ఆరోపణలు.. ఇది సాధ్యమేనా
- ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు డైటీషియన్ పదోన్నతు... ఫైల్ ని జర చూడండి?..
- ఆర్టిఐ వేసేందుకు సిద్ధమవుతున్న కొందరు అభ్యర్థులు...
- అన్ని సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత లిస్ట్ పెడితే ఇబ్బంది ఉండదు అంటున్న అభ్యర్థులు
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ పోస్టులు పదోన్నతి రూపంలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపడుతుంది. ఆది నుంచి ఇప్పటివరకు ముందుకు పోవడం లేదు వెనుకకు రావడం లేదు. అయితే ఇటీవల ఉన్నతాధికారులు 30లోగా లిస్టు రెడీ చేసి పదోన్నతులు ఇచ్చేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. అయితే డిఎంఈ పరిధిలో పనిచేసే ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు సెలవు పై ఉండటంతో వారి సంతకాలు లేకుండానే పదోన్నతుల లిస్టును పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఉన్నతాధికారులు లేకపోయినా వారి సంతకాలు లేకపోయినా పదోన్నతి లిస్టు ఎలా తయారు చేస్తారని దీనిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు కొందరు. నిజానికి అవినీతి జరిగిందా లేదా అన్నదానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఒకే యూనివర్సిటీలో ఎక్కువ మంది డైటీషియన్ కోర్సు పూర్తి చేసినట్లు దీనిపై ఎంక్వయిరీ పెట్టాలని అభ్యర్థులు రకరకాల ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి డైటీషియన్ కోర్సు చేసేందుకు పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్న విషయం కూడా ఇప్పటివరకు పర్మిషన్ లెటర్ ను పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సబ్మిట్ చేయలేదు. ఉటావుటిన అధికారులు శనివారం ఆదివారం సోమవారాల్లో పర్మిషన్ లెటర్ ను సబ్మిట్ చేయ లని అభ్యర్థులకు ఆదేశాలు జారీ చేశారు. డైటీషియన్ పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ప్రభుత్వం నుండి పర్మిషన్ లెటర్ ను దాఖలు చేయాలి కానీ అవి ఏమి చూడకుండానే పదోన్నతులు ఇచ్చే సమయంలో అధికారులకు ప్రభుత్వ పర్మిషన్ లెటర్ గుర్తుకు వచ్చిందా?... మూడు రోజుల్లో లెటర్స్ అడ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అయితే శనివారం ఆదివారం సెలవు సోమవారం కూడా పండుగ కావడంతో హుటాహుటిన చాలామంది పర్మిషన్ లెటర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. డైటీషియన్ పదోన్నతుల కోసం ఇంత హడావుడి చేయవలసిన అవసరం ఏముంది... లిస్టులో తప్పులు తడకలు ఉన్నాయని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి?... అయినా అధికారులు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు... కోర్టుకు కొందరు అభ్యర్థులు వెళితే కోర్టు సెప్టెంబర్ 30 వరకు లిస్ట్ తయారుచేసి పెట్టాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఆదేశాలు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

అధికారులు పర్మిషన్ లెటర్ కోసం మూడు రోజులు గడువు ఇవ్వడంతో రెండు రోజులు సెలవులు ఉండగా అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుండి పర్మిషన్ లెటర్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న గమ్మత్ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ లు డైటీషియన్ కోర్సు చేసినట్లయితే డి ఎం అండ్ హెచ్ ఓ పర్మిషన్ లెటర్ ఉండాలి కానీ అదే వీడిన తెచ్చే అది కార్లు ఇచ్చిన లెటర్ ని తీసుకువస్తే అది చెల్లదు సంతకం ఉన్నప్పటికీ అందులో సెక్షన్కు సంబంధించిన సీనియర్ అసిస్టెంట్ సూపరిండెంట్ ఏవో సంతకాల తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంతకం ఉండాలి అప్పుడే ఆ పర్మిషన్ లెటర్ చెందుతుంది. అంతేకాకుండా పై పోస్టులు కాకుండా ఇతర పోస్టులో ఉన్న వారికి రాష్ట్ర స్థాయిలో అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాలి. వైద్య కళాశాలలో పనిచేస్తున్న వారికైతే డిఎంఈ నుండి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేసే వారి కైతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుండి పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. అధికారులు జారీ చేసిన పర్మిషన్ లెటర్ ను యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి అప్పుడే ఆ సర్టిఫికెట్ కు విలువ ఉంటుంది. అధికారులు ఇచ్చిన పర్మిషన్కు విలువ ఉంటుంది కానీ ఇటీవల అధికారులు మూడు రోజులు సమయం ఇవ్వడంతో కొంతమంది ముందుగా పర్మిషన్ లేకుండానే యూనివర్సిటీలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. వారు మాత్రం కొందరు డిఎం అండ్ లెటర్ పై సంతకం తీసుకొని సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేసినట్లయితే ఆ సర్టిఫికెట్ చెల్లదు దానిలో తప్పనిసరిగా సెక్షన్స్ సీనియర్ అసిస్టెంట్ ఆఫీసు సూపర్డెంట్ ఏవో తో పాటు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సంతకం ఉండాలి అప్పుడే ఆ పర్మిషన్ లెటర్ కు విలువ ఉంటుంది.

డైటీషియన్ పదోన్నతులపై అనుమానాలు ఎన్నో ?..

వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు డైటీషన్ కోసం పూర్తి చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు డైటీషియన్ పదోన్నతుల ప్రక్రియ లేక అలాగే ఉండడం వల్ల ఎంతోమంది రిటైర్డ్ మెంటుకు దగ్గర ఉన్నారు. ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళినారు. డైటీషియన్ సీనియార్టీ లిస్టులో అవకతవకలు ఉన్నట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆరోపణల మీదే నడుస్తుంది. అధికారులు మారడం ఉన్న అధికారులు సక్రమంగా లిస్టు తయారు చేయకపోవడం అయితే ప్రస్తుతం కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ ర్లు సెలవుపై ఉండడం వారి సంతకాలు లేకుండానే ప్రస్తుతం సీనియార్టీ జాబితా తయారు చేసి లిస్టు పెడుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ లిస్టు పెట్టడానికి అంత హడావిడి ఎందుకు... లిస్టు పెట్టాలని చక్రం తిప్పుతూన్న అధికారి ఎవరు... ఒకవేళ ఆ లిస్టులో తప్పులు ఉన్నట్లయితే ఇరుక్కునే అధికారి ఎవరు?.. అర్హత ఉందా లేదా పర్మిషన్ తీసుకొని ఉన్నత చదువు చదివారా లేదా లిస్టులో ఉన్న ఏ అభ్యర్థి అయినా పదోన్నతి తీసుకొని రెండు సంవత్సరాలు పూర్తయిందా లేదా అన్న ప్రశ్నలకు సమాధానం లేదు?.. కానీ హుటా హుటినా లిస్టు మాత్రం తయారు చేస్తున్నారు. హుటా హుటిన పదోన్నతుల లిస్టు పెట్టాలని ఆ శాఖలో చక్రంతింపుతున్న అధికారి ఎవరు? ఆ అధికారి మాటలు ఎందుకు వినవలసి వస్తుంది. ఉన్నతాధికారులు దీనిపై ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎందుకు దృష్టి సాదించడం లేదు?.. ముఖ్యమంత్రి గారు మీరైనా జర ఈ పదోన్నతుల జాబితాను పరిశీలించి నిజాయితీగా ఉన్న అభ్యర్థులకు పదోన్నతులు ఇచ్చినట్లయితే కొంత వరకు న్యాయం జరుగుతుంది. కానీ ఆది నుంచి ఇప్పటివరకు అవినీతి ఆరోపణలతో పదోన్నతులు జాబితా తయారవుతుందని ఆరోపణలు ఉన్నాయి. కోర్టు కూడా తీర్పు ఇచ్చింది సెప్టెంబర్ 30 వరకు అన్ని పరిశీలించి అర్హత కలిగిన అభ్యర్థులకు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలని స్పష్టంగా చెప్పింది. అయినా ఇవేమి వినకుండా ఒక అధికారి చక్రం దింపడం వల్ల ఇవన్నీ జరుగుతున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ అధికారి ఎవరు మరి డి ఎం ఈ ఆ అధికారి మాటలు ఎందుకు వినవలసి వస్తుంది. ఒకవేళ ఆ అధికారి మాటలు విన్నట్లయితే పదోన్నతి జాబితా విడుదల తప్పుడు తడకలు ఉంటే అభ్యర్థులు ఆర్టిఐలు , కోర్టుకి వెళ్లే ప్రమాదం ఉంది అందుకు ఉన్నతాధికారులు ఆలోచించి స్పష్టంగా వెరిఫికేషన్ చేసి సెప్టెంబర్ 30 వరకు లిస్టు పెట్టాలని అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు.

డైటీషన్ పదోన్నతుల లిస్టు తయారు చేయడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ఉదాహరణగా తీసుకుంటే డైటీషియన్ సర్టిఫికెట్ దాఖలు చేసిన సమయంలోనే ప్రభుత్వం ఉద్యోగుల ఉన్నత చదువుల కోసం ఇచ్చిన పర్మిషన్ సర్టిఫికెట్ కూడా దాఖలు చేయాల్సి ఉంది. అలాంటివి ఏం లేకుండానే డైటీషియన్ లిస్ట్ తయారు చేశారు. డి ఎం ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉన్నత చదువులకు అనుమతి ఇచ్చిన లెటర్ను తీసుకురావాలని దీనికి మూడు రోజులు గడువు విధించడం అందులో ఒకటి సెలవు రావడం దీనిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హడావిడిన లిస్టు తయారు చేయడం ఏంటి? కోర్టు కూడా సెప్టెంబర్ 30 వరకు లిస్టు పెట్టాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీటిని పట్టించుకోకుండానే అధికారులు ఉటా ఉటేనా లిస్టు తయారు చేయవలసిన అవసరం ఏముంది?... కోర్టు ఇచ్చిన సమయంఇంకా 30 నుంచి 40 రోజుల సమయం ఉంది. అధికారులు ఇన్ని తప్పులు చేస్తూ డైటీషియన్ పదోన్నతుల లిస్టు హడావిడిగా ఎందుకు తయారు చేస్తున్నారు. అప్పుడు పర్మిషన్ లెటర్స్ అడగలేదు ఇప్పుడు పర్మిషన్ లెటర్లతో అవసరమేమి?.. డి ఎం ఈ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ అధికారులు లేకపోవడం వారు లేని సమయాన్ని చూసి లిస్టు పెట్టడం వలసిన అవసరమేంటి?... అధికారులు లేకుండా లిస్టు పెట్టడం పై అనుమానాలు ఎన్నో వ్యక్తం అవుతున్నాయి?..

సెప్టెంబర్ 30 వరకు డైటీషియన్ పదోన్నతుల లిస్టు పెట్టండి...

సెప్టెంబర్ 30 2024 వరకు డైటీషియన్ పదోన్నతుల తుది జాబితా పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. కానీ డి ఎం ఈ కార్యాలయంలో ఇద్దరు డిడిలు సెలవు పై వెళ్లడం ఆ డీడీలు లేకుండానే కార్యాలయంలో ఒక ఉన్నతాధికారి చక్రం దింపుతూ లిస్టు పెట్టాలని ఉద్దేశంతో ఉన్నట్టు విశ్వాసనీయ సమాచారం. కోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా డీఎంఈ కార్యాలయ అధికారులు ఎందుకు హడావిడి నా డైటీషియన్ పదోన్నతుల లిస్టు పెడుతున్నారు. స్పష్టంగా పట్టురాలన్నింటినీ పరిశీలించిన మీదట లిస్టు పెట్టవలసి ఇచ్చిన అవసరం ఉంది. అంతేకాదు శనివారం, ఆదివారం సోమవారం మూడు రోజుల్లోగా ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ లెటర్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు అయితే విచిత్రమ్ ఏమిటంటే శనివారం ఒకటే వర్కింగ్ డే ఆదివారం సెలవు సోమవారం కృష్ణాష్టమి అంటే ఒక రోజులో పర్మిషన్ లెటర్ ఎలా తీసుకురాగలరు. ఒకవేళ పర్మిషన్ లెటర్ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు లేని వారి పరిస్థితి ఏంటి? అంటే ఈ విషయాన్ని గమనించినట్లయితే పదోన్నతుల విషయంలో చక్రం తిరుగుతుందని అర్థమవుతుంది మనకు. డి ఎం ఈ గారు ఇప్పటికైనా అన్ని సర్టిఫికెట్లు పరిశీలించి అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు.