Sports & Games

Breaking News

వర్షాకాలం వచ్చే వ్యాధులపై ముందు జాగ్రత్త అవసరం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

బజరత్నూర్,(ఆరోగ్యజ్యోతి): వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు పై ప్రజలకు అవగాహన అవసరమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ భీమ్ రావ్ అన్నారు. మండలంలోని చిమ్మాయి తండాలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చిన్మయి తాండ కు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వైద్యాధికారి డాక్టర్ భీమ్రావు పాటు మెడికల్ పారామెడికల్ సిబ్బంది కాలినడకన వెళ్లారు. వెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడంతోపాటు వ్యాధులపై అవగాహన కల్పించారు. వర్షాకాలం కావడం వల్ల ఈగలు దోమలు దరిచేరకుండా చూడాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలను మురికి కాల్వలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు అపరిశుభ్రత వల్ల దోమలు ఈగలు దరిచేరి డెంగ్యూ మలేరియా అతిసారా టైఫాయిడ్ పత్యకామర్ల లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడే బదులు వ్యాధులు రాకుండా ఉండేందుకు పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెచ్ఈఓ సూర్య ప్రకాష్ ఎం ఎల్ హెచ్ పి దివ్యవాణి హెల్త్ అసిస్టెంట్ రమేష్ ఏఎన్ఎం విజయ ఆశా కార్యకర్త పంచశీల తో పాటు తదితరులు పాల్గొన్నారు.