510 జీవోని అందరికీ అమలు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వినతిపత్రం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
510.జీ.ఓ.అందరికీ అమలు చేయాలని సీ.పీ.ఐ. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి వినతిపత్రం ఇచ్చిన ఎన్.హెచ్.ఎం.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
హనుమకొండ,(ఆరోగ్య జ్యోతి): హరిత కాకతీయ హోటల్లో కొత్తగూడెం సీ.పీ.ఐ. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా వినతిపత్రం అందజేశారు. వరంగల్ జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గన్నరపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 మందికి గత బీ.ఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, వెంటనే 4000 మందికి న్యాయం చేయాలని ఎమ్మెల్యేను సమస్యలను వివరించారు . ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమానపనికి సమానవేతనం వెంటనే ప్రకటిం చాలన్నారు. 2018 నుండి 2024 వరకు 510 జీవో అందరికీ అమలు చేయాలి, పి ఆర్ సి ఏరియర్స్ 7 నెలలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి,మహిళా ఉద్యోగులకు 180 రోజులతో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా తీసుకురావాలన్నారు. క్యాడర్ ఫిక్సేషన్ చేయాలని, ఎన్హెచ్ఎంలో 65 సంవత్సరాలు నిండిన వారికి రిటర్మెంట్ ప్రకటించి ఉద్యోగి ఒక నెల పెన్షన్ 25వేలు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దామర కృష్ణ, హనుమకొండ జిల్లా ఏఐటియుసి అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి, సుమ, హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి, హనుమకొండ ఆయుష్ ఎస్.ఎన్.వో.లు ఇందిరా , కళావతి, నవీన్ పర్వీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.