Sports & Games

Breaking News

ఇచ్చోడలో ఆయుర్వేద వైద్య శిబిరం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

ఆదిలాబాద్, ఇచ్చోడ,(ఆరోగ్య జ్యోతి):  మండల కేంద్రంలో స్థానిక ఓల్డ్ కాలోని గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల  ఆవరణ లో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు...  వృద్ధాప్య వైద్య శిబిరం/ జిరాట్రిక్ క్యాంప్ ఇచ్చోడ ఆయుష్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ ఆయుష్ డాక్టర్ ప్రీతల్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించిన  ఈ వైద్య శిబిరంలో సుమారు 150 మంది వృద్ధులు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం జరిగిందని...వారికి ఉచితంగా ఆయుర్వేద  మందులు, తైలాలు , చూర్ణాలు ఇవ్వడం  జరిగిందని  జిల్లాలో పలు ప్రాంతాల్లో కమిషనర్ ప్రశాంతి మేడమ్  ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.. ఇచ్చోడ  ఆయుష్ డిస్పెన్సరీ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ... ఇచ్చోడ ఓల్డ్ కాలనీలో ఏర్పాటుచేసిన ఈ వైద్య శిబిరం మొదట ధన్వంతరి చిత్రపటానికి డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ ఆయుష్ విభాగం డాక్టర్ ప్రీతల్ , ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 వ మెడికల్ ఆఫీసర్  డాక్టర్ అలేఖ్య పూజ చేసిన అనంతరం.. ఈ వైద్య శిబిరం ప్రారంభించడం జరిగిందని, ఈ వైద్య శిబిరంలో  140 మంది పేషెంట్లకు రోగ నిర్దారణ చేసి... కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, అర్షమొలలు, బి.పీ . షుగర్ వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగిందని.. ఈ వైద్య శిబిరానికి రానివారు  ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో గల ఆయుష్ డిస్పెన్సర్ కి వచ్చి పరీక్షలు చేసుకొని ఉచితంగా మందులు తీసుకోవాలని ఆయన  కోరారు. ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ సత్యలక్ష్మి, ఎస్. సి. ఎస్. లక్ష్మి, ఎస్ ఎన్ ఓ లు పద్మావతి, ఎండి హైమద్, వెస్ట్ సబ్ సెంటర్ ఏఎన్ఎంలు పద్మావతి, సుధారాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.