Sports & Games

Breaking News

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీకృష్ణకు సన్మానం - ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారుల సన్మానం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్యజ్యోతి): నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీకృష్ణాను ఆదిలాబాద్ జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీ కృష్ణ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు సన్మానం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. అందరం కలిసికట్టుగా బాధ్యతగా పనిచేసే ఆదిలాబాద్ జిల్లాకు ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. వైద్యుల సమయపాలన పాటిస్తూ సరిగా విధులు నిర్వహిస్తూ రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీకృష్ణ సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులంతా యంగ్ డైనమిక్ గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమునైజేషన్ అధికారి నార్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వైసీ శ్రీనివాస్, జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్, డాక్టర్ శ్రావ్య, డాక్టర్ నయనతా, డాక్టర్ సుచరిత, డాక్టర్ డాక్టర్ వంశీ ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.