వైద్య ఆరోగ్యశాఖ సంకల్ప పథకం కింద ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సంకల్ప పథకం లో పనిచేయుటకు సిబ్బంది కావలెనని ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శిక్షణ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ మూడు పోస్టులు, ప్రాజెక్టు నర్స్ ఒకటి, ప్రాజెక్టు నర్స్ 3 ఫీల్డ్, ప్రాజెక్టు నర్స్ సీనియర్ ఫీల్డ్ 3, డాటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు కోరుచున్నారు.ఎయిమ్స్ బీబీనగర్ క్రింద ఐ సి ఎం ఆర్ నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ సంకల్ప్ ద్వారా పోస్టల్ ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 30 నెలల పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో వారానికి 4-5 రోజులు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పని చేయవలసి ఉంటుంది. దరఖాస్తును thanigaipaeds@gmail.com అనే ఈమెయిల్ అడ్రస్ కు పంపవలెను.