టిబి నివారణ కొరకు కలిసికట్టుగా పనిచేయాలి
రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్
ఆదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి): టిబి నివారణ కొరకు వైద్య ఆరోగ్యశాఖ మరియు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని శాఖలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసినప్పుడే టీబీని నివారించవచ్చని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. డైరెక్టర్ ఛాంబర్ లో టిబి నివారణ పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ టీబీ నివారణ కోసం మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలిపారు. టీబీ అనేది ఎవరికైనా రావచ్చు ఏ అవయవానికైనా రావచ్చు అన్నారు. ఇది నివారణ కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు ఇందులో భాగంగానే జీన్స్ లో టీవీ రోగులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీవీ నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత, డాక్టర్ సందీప్ యాదవ్ డాక్టర్ రమేష్ పవర్ డాక్టర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ పద్మావళి, డాక్టర్ కార్తీక్ రెడ్డి, డాక్టర్ సాయి ప్రియ, స్టాఫ్ నర్స్ సిమ్మి, ప్రమోద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.