Sports & Games

Breaking News

అదిలాబాదుకు సంకల్ప కార్యక్రమం రావడం సంతోషకరం -రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

- రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్
ఆదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి): అదిలాబాద్ రిమ్స్ కు సంకల్ప ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా రావడం ఎంతో సంతోషకరంగా ఉందని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. ఐ సి ఎం ఆర్ బృందం చే ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులు సంకల్ ప పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ సంకల్పం అనేది దేశవ్యాప్తంగా 10 జిల్లాలను ప్రయోగాత్మకంగా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిందన్నారు అందులో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు అవకాశం రావడం ఎంతో సంతోషం గా ఉందని తెలిపారు. గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్నారని రక్తహీనతతో బాధపడుతున్నారని పౌష్టికాహారం సక్రమంగా లేక గర్భిణీ ఆయన సమయంలో పౌష్టికాహారం సక్రమంగా తీసుకోకపోవడం వల్ల కడుపులోని శిశువు బలహీనంగా ఉండడం తల్లి బలహీనంగా ఉండడం లాంటి సమస్యలు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో ఎదురవుతున్నాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాను ప్రయోగాత్మకం కింద తీసుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 10 సైట్‌లలో నియోనాటల్ మరణాలను సింగిల్ డిజిట్‌కు తగ్గించడానికి ప్రోగ్రామ్ అమలును బలోపేతం చేయడంపై దృష్టి సారించిన ప్రయోగత్మకంగా 10 జిల్లాలను కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు.  ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మరియు ఉన్నావ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, హర్యానాలోని అంబాలా, మధ్యప్రదేశ్‌లోని ఖర్గావ్, బీహార్‌లోని పూర్నియా, కర్ణాటకలోని కొప్పల్, తెలంగాణలోని ఆదిలాబాద్, రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ మరియు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, జిల్లా మరియు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలు మరియు స్వామి రామ హిమాలయన్ యూనివర్శిటీ గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతోందనీ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ సి యు ఇన్చార్జ్ డాక్టర్ అనంతరావు, డాక్టర్ కౌస్తుభ, డాక్టర్ తిరుమల్ రెడ్డి తోపాటు ఐసీఎంఆర్ బృందం రిమ్స్ బృందం తదితరులు పాల్గొన్నారు.