Sports & Games

Breaking News

అద్దె సర్టిఫికెట్ తో నడుపుతున్న మెడికల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి - టి పి ఏ జేఏసీ చైర్మన్ బత్తాని సత్యనారాయణ గౌడ్.

Aj news 

తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసి చదువుకొని ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్న ఫార్మసిస్ట్ సోదరులకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం కిరాయి  సర్టిఫికెట్లతో మెడికల్ షాపులు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫార్మసిస్ట్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో కీలకమైన బాధ్యతయుతమైన  పోస్టులో ఉన్న డైరెక్టర్ జనరల్ కమలహాసన్ రెడ్డి IPS లాంటి నిజాయితీ కలిగిన అధికారి ఉన్నారని సంఘ నాయకులు పేర్కొన్నారు. మరి మందుల షాపులకు లైసెన్సులు ఇచ్చే సమయంలో పూర్తిస్థాయి జాగ్రత్త వహిస్తూ మీరు లైసెన్స్ ఇస్తున్నారు కానీ లైసెన్సు ఎవరి పేరు మీద ఉంది మందుల షాపుల్లో ఎవరు మందులు ఇస్తున్నారు అనేదాన్ని  జిల్లా స్థాయి అధికారులు పరిశీలించటంలో విఫలమవుతున్నారని TPA JAC చైర్మన్ బత్తిని సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్స్ ఒకరి పేరు మీద మందుల షాపు నడుపుతున్నది ఇంకొకరు అని వారు దుయ్య బట్టారు  మెడికల్ షాపులను తరచుగా తనిఖీ లు చేసి ఫార్మాసిస్ట్ లేకుంటే ఆ మెడికల్ షాపు లైసెన్సు రద్దు చేసి ఆ ఫార్మాసిస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయమని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ కు సిపరసు చేయాలని మెడికల్ షాపు యజమానులు ఇలా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న తీరుపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కఠినమైన చట్టాలు ఫార్మసీ చట్టాల ద్వారా మరియు డ్రగ్స్ ఆక్ట్ చట్టాల ద్వారా వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఫార్మసీ జేఏసీ కోరింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంబంధిత డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి కిరాయి సర్టిఫికెట్లతో మందుల దుకాణం నడుపుతున్న వారిని పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు విన్నవించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి   ప్రభుత్వం అధికారంలోకి వచ్చక   మత్తుమందులను సరఫరా ను ఉక్కు పాదం కంట్రోల్ చేస్తుందని. కానీ రిజిస్టర్ ఫార్మాసిస్ట్ లేని మెడికల్ షాపుల్లో విచ్చల విడిగా మత్తు ట్యాబ్లెట్లు సిరప్ లు ఎలాంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్ముతున్నారని అందులో కార్పొరేట్ చైన్ ఫార్మసీ అయిన అపోలో, మెడిప్లస్, అస్టార్, ఆదిత్య, ఇంకా పదుల సంఖ్యలో ఉన్న చైన్ ఫార్మసీ లు లాభాపేక్షతో ఇది అవగాహన లోపం వల్ల ఇస్తున్నారని TPA JAC ఆవేదన వ్యక్తం చేశారు. అదే సొంత లైసెన్స్ సొంత ఫార్మసీ సర్టిఫికెట్ ఉన్నవారికి అవగాహన ఉంటుందని డాక్టర్ రాసిచ్చిన మందులు మాత్రమే ఇస్తారని ఎవరు పడితే వారికి ఎలాంటి మందులు ఇవ్వరని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మందుల దుకాణాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కిరాయి సర్టిఫికెట్ తో మెడికల్ షాపులు నిర్వహిస్తున్న వారిపై  చర్యలు తీసుకోవాలని TPA JAC సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. డైరెక్టర్ జరరల్ కమలహాసన్ రెడ్డి SIR తమరు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో కీలకమైన మరియు బాధ్యతాయుతమైన పొస్టులో వున్నారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా నిర్వహించే అత్యంత ముఖ్యమైన ఔషద నియంత్రణ మరియు పరిపాలన లాంటి అత్యంత ముఖ్యమైన పని తమరు చేస్తున్నారు. కాబట్టి  మా డిమాండ్లకు మీరు తీరుస్తారు అని ఆశిస్తున్నాము.

మా డిమాండ్స్

1, రిజిష్టర్డ్ ఫార్మసిస్ట్ ద్వారా మాత్రమే మేడిసిన్స్ అమ్మకాలు జరగావలసియుండగా అది 90% ఎక్కడ జరగడం లేదు. అసలు రిజిష్టర్డ్ ఫార్మసిస్ట్ అనే అతను మెడికల్ షాపులలో భూతద్దం పెట్టి చుసిన కనిపించని పరిస్తితి. తెలంగాణా రాష్ట్రంలో నెలకొని వున్నది. అన్న విషయం తమరి నోటిస్ లో కూడా వుంది. రిజిష్టర్డ్ ఫార్మసిస్ట్ లు తమ ఫార్మసి కౌన్సిల్ సర్టిఫికెట్ మెడికల్ షాపు యజమానులకు కిరాయికి ఇచ్చి విదేశాలకు వెళ్ళడం, ప్రబుత్వ ఉద్యోగం చేయడం, ప్రయివేటు ఉద్యోగాలు చేయడం, ఇతర వేరే వ్యాపారాలు చేయడం. జరుగుతుంది. దీన్ని అరికట్టాలి

2, తమరి ఔషద నియత్రణ పరిపాలన శాఖా దృష్టిలో మీ ఫార్మసిస్ట్ లే వారి ఫార్మసీ సర్టిఫికెట్ కిరాయికి ఇస్తున్నారు తరతరాలుగా అనాదిగా జరుగుతుంది. దానికి మేము వెంటనే ఏమి చేయగలము అనే అపోహ వుంది. కానీ అది నిజం కాదు.

3. అసలు నిజం ఏమిటి అంటే మా ఫార్మసిస్ట్ లు ఫార్మసి చట్టాల ద్వారా మాకు సంక్రమించిన బాధ్యతను హక్కును మేము నిర్వర్తించే దానికి వీలైనంత మంది, తెలంగాణా రాష్ట్రనికి సరిపోయోంత మంది ఫార్మసిస్ట్ లు సిద్దంగా వున్నారు. మరియు స్వంతంగా జనరల్ కౌంటర్స్ మెడికల్ స్టోర్స్ పెట్టుకోవడానికి కూడా తెలంగాణా రాష్ట్రనికి సరిపోయోంత మంది ఫార్మసిస్ట్ లు సిద్దంగా వున్నారు.

4, కానీ మేము ఆత్మ గౌరవంతో పాటుగా గౌరవప్రదమైన వేతనానికి మాత్రమే పనిచేస్తము. అంటే

5. రోగులకు డిస్పెన్సింగ్ ఔషద నియత్రణ చట్టాలకు లోబడి మాత్రమే పని చేస్తాము. మరియు డిప్లొమా ఫార్మసిస్ట్ లకు 30,000/- వేతనం, డిగ్రీ ఫార్మసిస్ట్ లకు 40,000/ వేతనం, మాస్టర్ అఫ్ ఫార్మసి మరియు ఫార్మా D. వాళ్ళకు 50,000/- వేతనం, కావాలి అని మేము మిమ్మల్ని మెడికల్ షాపు యజమానులను అర్ధిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో బత్తిని సత్యనారాయణ గౌడ్, మెరుగు రాధాకృష్ణ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు వేణు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పి అశోక్, బి ప్రదీప్ కుమార్, గుండె రాజ్, శ్రావణ్  పూనం, శంకర్, కార్తీక్, జి మధు తదితరులు పాల్గొన్నారు.