దోమలపై మున్సిపల్ సిబ్బంది దండయాత్ర
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): డెంగ్యూ మలేరియా పచ్చకామర్లు తోపాటు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమంలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని 11వ వార్డు రాంనగర్ కాలనీలో దోమల నివారణ కొరకు ప్రత్యేకంగా స్వీ కార్యక్రమాన్ని సూపర్వైజర్లు హనుమాన్ దాస్, సయ్యద్ అలీలఆధ్వర్యంలో నిర్వహించారు. కాలనీలో త్వరలో ప్రత్యేక డ్రైవరు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డెంగ్యూ తో మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు రాంనగర్ క్వార్టర్స్ వెనుక భాగంలో నిల్వ ఉన్న నీటిలో దోమల నివారణ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దోమలమందు చల్లడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ ను కూడా వేశారు.