ఔషధ నియంత్రణ, పరిపాలన కార్యాలయం హైదరాబాద్ కు కదం తొక్కుతు వెల్లుతున్నా ఫార్మసిస్టులు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
*ఔషధ నియంత్రణ, పరిపాలన కార్యాలయం హైదరాబాద్ కు కదం తొక్కుతు వెల్లుతున్నా ఫార్మసిస్టులు
రిజిస్టర్ ఫార్మాసిస్ట్ లు మాత్రమే మందుల షాపులో ఉండాలి
- అక్రమంగా కిరాయి సర్టిఫికెట్లతో నడుస్తున్న మందుల షాపుల లైసెన్స్ లను రద్దు చేయాలి
- నేడు డి సి ఏ కార్యాలయం ఎదుట ధర్నా
- తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మాసిస్టులందరూ డి సి ఏ ఆఫీస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. రిజిస్టర్ ఫార్మసిస్ట్ లు మాత్రమే మెడికల్ షాప్ లను నడిపించాలని అద్దె సర్టిఫికెట్లతో నడిపిస్తున్న మెడికల్ షాపులను మూసివేయాలని తదితర డిమాండ్లతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టులందరూ ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఫార్మసిస్టులు చదివిన చదువు కు ప్రభుత్వం గుర్తించాక అద్దె సర్టిఫికెట్లు తో నడుపుతున్న మెడికల్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహిస్తున్నారు. సొమ్ము ఒకరీది సోకు ఒకరిది అన్న చందనంగా ఫార్మసీ కౌన్సిల్ తయారైందని జాయింట్ యాక్షన్ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు వినతి పత్రలు సమర్పించినప్పటికీ ఫలితం అంతంత మాత్రమే ఉందని ఫార్మసిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏబిసిడిలు రానివారు కూడా ఫార్మసీని ఏర్పాటు చేసుకొని నాసిరకం మందులు... అమ్ముతూ అమాయకమైన పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని. మందుల విలువలు తెలియని వారు కూడా ఫార్మసీ లు నడుపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకుపోయినప్పటికీ ఫలితం లేదని వారు తెలిపారు. అద్దె సర్టిఫికెట్లతో నడుపుతున్న ఫార్మసీలను ప్రభుత్వం మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులు మూసివేయాలని తదితర డిమాండ్లతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
బత్తిని సత్యనారాయణ గౌడ్.