వెల్నెస్ సెంటర్లో ఆయుర్వేద వైద్య శిబిరం
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని వెల్నెస్ సెంటర్లో ఆయుష్ శాఖలోని ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆయుష్ డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రితల్ రాథోడ్ , ఆయుర్వేద వైద్య అధికారి డాక్టర్ వాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు యునాని వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు. వృద్ధులకు వచ్చే వ్యాధులు మనం మెదడు మరియు వెన్నుముకకు వచ్చే సమస్యలు కంటి సంబంధిత సమస్యలు వినికిడి కి సంబంధించిన సమస్యలు శ్వాసకోశ సమస్యలు జీర్ణ సమస్యలు కంటి మరియు మూత్ర సమస్యలతోపాటు తదితర వాటికి చికిత్సలు అందించడం జరుగుతుందని వారు వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను ఆయుష్ వైద్య విధానాల ద్వారా సులువుగా చికిత్సలు అందించడం వృద్ధాప్య వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ఆయుష్ శాఖ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆరోగ్య మందిర్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు సాధారణ అనారోగ్య సమస్యలు రక్తపోటు మధుమేహం మోకాళ్ల నొప్పులు తోపాటు అనేక రకాల జబ్బులకు చికిత్సలు అందిస్తారని వారు పేర్కొన్నారు.తొందరగా తగ్గించే ఆయుర్వేద వైద్య మందులను ప్రతి ఒక్కరు వాడాలని తెలిపారు.ఈ వైద్య శిబిరంలో వృద్ధులకు అన్ని రకాల వ్యాధులకు పై అవగాహన కల్పించడంతోపాటు చికిత్సలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో వచ్చే వ్యాధుల కు చికిత్సలు అందజేశామని తెలిపారు ఆదిలాబాద్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ శిబిరంలో వర్షాకాలం వచ్చే వ్యాధులు జాగ్రత్తగా గురించి కూడా వృద్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మేఘనాథ్, డాక్టర్ ప్రీతి ఫార్మసిస్ట్ సంజీవ్ కుమార్, నారాయణ, ఎస్ మంత్, జయ బాబు తదితరులు పాల్గొన్నారు