సి హెచ్ సి లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి
- CHC ఆసుపత్రి సిబ్బందికి పెండింగులో ఉన్న వేతనాలు చెల్లించాలి,లేనిపక్షంలో అందోలన కార్యక్రమాలు చేస్తాం*
- AITUC జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్
*వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి*
కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్,(ఆరోగ్య జ్యోతి): సి హెచ్ సి లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ ఉద్యోగులైన శానిటేషన్,పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ గార్డ్ లకు పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు టి దివాకర్ డిమాండ్ చేశారు.ఈరోజు *పెండింగులో ఉన్న వేతనాలు చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ AITUC ఆధ్వర్యంలో హాస్పటల్ ముందు నిరసన* ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు టి దివాకర్ మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో కార్మికులు తమ కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు వేతనాల చెల్లింపుకై ఆస్పటల్ సూపర్డెంట్ గారిని మరియు కాంట్రాక్టర్ గారిని కలిసినప్పుడల్లా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు.వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో AITUC జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, చిరంజీవి,మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ఆసిఫాబాద్ అధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి మల్లేష్ కార్మికులు మురళి,నీల, మమత,హరీష్, గంగన్న, గుణవంతరవు,తోపాటు తదితరులు పాల్గొన్నారు