ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం
.Respected Sir
అదిలాబాద్ జిల్లా:
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం.
ఎయిడ్స్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎయిడ్స్ మరియు కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ ఎం. గజానన్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టనం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో యువజన ఉత్సవ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన పై డిగ్రీ కళాశాల విద్యార్థులకు 2కె మరియు 5కె పరుగు పందెం నిర్వహించి , విద్యార్థులకు అవగాహన కల్పించి, హిచ్ ఐ వి/ ఎయిడ్స్ ,సుఖవ్యాధులు, టీబీ, డ్రగ్స్ వాటికి గురికావడంపై అవగాహన కల్పించి, ఇతరులకు అవగాహన కలిపించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమము లో గవర్నమెంట్ డిగ్రీ విద్యార్థినీ, విద్యార్థులకు రెడ్ రన్ పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు మొదటి బహుమతి 1000 రూ. రెండవ బహుమతి 750 రూ. మూడవ బహుమతి 500 రూ. మరియు సర్టిఫికెట్ లు ,ఆగస్టు 12 తేదీ, అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం లో, జిల్లా అధికారులతో విజేతలకు బహుమతులు అందిస్తామని తెలియజేసారు. ఈ సందర్భంగా సి పి ఎం నాగరాజు, మాట్లాడుతూ హెచ్ఐవి నివారణ చర్యలు ప్రతి ఒక్కరు చేపట్టాలని తద్వారా వ్యాధి నివారణ సాధ్యమవుతుందని అన్నారు .హెచ్ఐవి బాధితులకు మనోధైర్యం కల్పించి ప్రభుత్వ పథకాలను అందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, బానురేఖ, సరిత వారిసిబ్బంది, ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.