నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలి
ఎన్ హెచ్ ఎంలో సుదీర్ఘకాల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
హైదరాబాద్ 06 ఆగస్టు 2024: జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో గత చాలా సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు 17514 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వెంటనే క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మంగళవారం ప్రభుత్వాన్ని కోరారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం క్రమబద్ధీకరించేందుకు మాత్రం ముందుకు రావకపోవడం దారుణమన్నారు. దీంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా అన్ని క్యాడర్స్కు 510 జీవో ను వర్తింప చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 వేల మందికి గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అన్యాయం చేసిందని వెంటనే 4000 మందికి న్యాయం చేసి 4000 మందికి 510 జీవో అమలయ్యేలా చర్యలు వెంటనే తీసుకోవాలన్నారు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం వెంటనే ప్రకటించాలని , మహిళా ఉద్యోగులకు 180 రోజులతో వేతనంతోకూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి నెల 1వ తేదీ న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి, హెల్త్ కార్డ్స్ , హెల్త్ ఇన్సూరెన్స్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ వర్తించే విధంగా తీసుకురావాలి, ఎన్ హెచ్ ఎం లో 65 సంవత్సరాలు నిండినవారికి రిటర్మెంట్ ప్రకటించి ఉద్యోగి ఒక నెల పెన్షన్ 25000 ఇచ్చేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలని సందర్భంగా తెలియజేశారు.