*నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ ఎమ్ ఎల్ హెచ్ పి లకు బేసిక్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి*
ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. నరసింహ డిమాండ్
నాగర్ కర్నూల్,(ఆరోగ్య జ్యోతి):నేషనల్ హెల్త్ మిషన్ స్కీములో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ( ఎం ఎల్ హెచ్ పి ) గత మూడు సంవత్సరాల నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలలో ప్రజానీకానికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు అమలు చేయకుండా అతి తక్కువ జీతాలతో విధులు నిర్వహించుకుంటున్నారని, డ్యూటీ చార్ట్ ప్రకారం విధులు చేయించకుండా అనేక రకాల క్రింది స్థాయి పనులను వారిపై రుద్దుతూ పని భారాన్ని పెంచటం అన్యాయమని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
నేడు నాగర్ కర్నూల్ జిల్లా ఎం ఎల్ హెచ్ పి ల జనరల్ బాడీ మీటింగ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయికుమార్ అధ్యక్షతన లక్ష్మణాచారి భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతతో, డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక చేయబడినటువంటి ఎంఎల్ హెచ్ పి ఉద్యోగులకు కనీస వేతనం రూపాయలు 44000 ఇవ్వవలసి ఉండగా కేవలం 30 వేల జీతం మాత్రమే చెల్లిస్తూ అధిక పని భారాన్ని వారిపై మోపుతూ అన్ని స్థాయిలో అణులు వారితో చేయించుకోవడం అన్యాయమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ ఏఐటియుసి అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుందని వారి సందర్భంగా తెలియజేశారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడి శివశంకర్, జిల్లా కార్యదర్శి బండి లక్ష్మీపతి, శివ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
*నూతన కమిటీ ఎన్నిక*
జిల్లా గౌరవ అధ్యక్షులుగా మారేడు శివశంకర్, అధ్యక్షులుగా టి సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా జి కల్పన, ఉపాధ్యక్షురాలుగా పి వరలక్ష్మి, బి శృతి, కార్యదర్శిలుగా ఇ పవన్ కళ్యాణ్, కోశాధికారిగా ఆర్ రాజు నాయక్,కార్యవర్గ సభ్యులుగా జీ జ్యోతి, గోవర్ధన్ లతో నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది.