Sports & Games

Breaking News

పెన్షనర్ భవన్ లో యునాని వైద్య శిబిరం

అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): అదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో గల పెన్షనర్ భవనంలో ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు యునాని వైద్య శిబిరం నిర్వహించినట్లు హాయిస్ట్ డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రితల్ రాథోడ్ యునాని వైద్య అధికారి డాక్టర్ ఫరీదా బేగం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు యునాని వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో వృద్ధులకు అన్ని రకాల వ్యాధులకు పై అవగాహన కల్పించడంతోపాటు చికిత్సలు అందించడం జరిగిందని పేర్కొన్నారు ముఖ్యంగా వృద్ధుల్లో వచ్చే వ్యాధుల కు చికిత్సలు అందజేశామని తెలిపారు ఆదిలాబాద్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ శిబిరంలో వర్షాకాలం వచ్చే వ్యాధులు జాగ్రత్తగా గురించి కూడా వృద్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ హెల్త్ సిద్ధార్థ ఎస్ఎన్ఓ జైయబాబు పి టి ఎస్ నవీన్ కుమార్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.