Sports & Games

Breaking News

పెన్షన్ భవనంలో రేపు ఉచిత వైద్య శిబిరం

అదిలాబాద్ (ఆరోగ్య జ్యోతి): ఎన్టీఆర్ చౌక్ లోని పెన్షనర్ భవన్లో  వృద్ధుల కోసం (జెరిటిక్) ఉచిత యునాని వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ ఫరీదా బేగం తెలిపారు. ఈ వైద్య శిబిరం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది ఆమె పేర్కొన్నారు. పెన్షనర్ భవనంలో రిటైర్మెంట్ వృద్ధులకే కాకుండా పట్టణంలోని అందరు వృద్ధులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వైద్య శిబినానికి వచ్చే వృద్ధులు ఆధార్ కార్డు తో పాటు సెల్ నెంబర్ కూడా వెంట తీసుకొని రాగాలని తెలిపారు.  వృద్ధులకు వచ్చే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తోపాటు జనరల్ వీక్నెస్ తోపాటు అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా యున్నాని వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ శిబిరం ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరూ పెంచిన భవన్లో నిర్వహించే యునాని వైద్య శిబిరంలో వైద్య సేవలు తీసుకోవాలని తెలిపారు.