అమ్మ పాలే శిశువుకు శ్రీరామరక్ష
తంగడపల్లి (ఆరోగ్య జ్యోతి): పుట్టిన పిల్లలకు అమ్మపాలె తాగించాలని అవి జీవితాంతం శ్రీరామరక్షాల పనిచేస్తాయని తంగడపల్లి ఆరోగ్య విస్తీర్ణ అధికారి కే సత్యనారాయణ అన్నారు తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పతంగి ఆరెగూడెం గ్రామంలో అంగన్వాడి సెంటర్లలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారో కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే ముర్రపాలు ను తాగించాలని అది శిశువు జన్మకు శ్రీరామరక్షగా పనిచేస్తుందన్నారు ముర్రపాలలో శరీరానికి అవసరమయ్యే అన్ని విటమిన్స్ మినరల్స్ క్యాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయని తెలిపారు. చాలామందికి ఈ విషయం తెలవక ముర్రపాలను పిండి పారపోస్తారని అది చేయడం తప్పు అన్నారు. ముర్రపాల వల్లనే శిశు శరీరం గట్టిదనం ఏర్పడి రోగనిరోధక శక్తి పెంచుతుందని తెలిపారు. చాలామంది తల్లిపాలు ఇవ్వకుండా డబ్బా పాలు తాపుతారని దీని ద్వారా శిశువు అనారోగ్యాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ శిశువుకు తల్లిపాలు తాగించాలని ఆమె సూచించారు. తల్లిపాలల్లో శిశువుకు అవసరమయ్యే అన్ని రకాల పోషకాహాలు ఉంటాయని పేర్కొన్నారు తల్లిపాల వారోత్సవ సందర్భంగా తల్లిపాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది.
V. గంగాధర్ G.ఇందిరా.ZPHS hm.k. వేణుగోపాల్ ప్రైమరీ స్కూల్.hm.B.దశరథ.అంగన్ వాడి టీచర్ల మంజుల,సునీత,ఆశ.లక్ష్మి.ఆయలు మనెమ్మ.యాదమ్మ.
తదితరులు పాల్గొన్నారు.