కె ఆర్ కె అంగన్వాడీలో అంన్నప్రాసన
అదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి): కె ఆర్ కే కాలనీలోని అంగన్వాడి సెంటర్లలో అంగన్వాడీ కార్యకర్త నిర్మల ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో అన్నదా అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వహించడం జరిగిందని అంగన్వాడీ కార్యకర్త నిర్మల తెలిపారు. కె ఆర్ కె కాలనీలోని అంగన్వాడి సెంటర్లో ప్రతీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అంగన్వాడి సెంటర్ లో కార్పొరేట్ స్థాయిలో ఆటలు పాటలు విద్య తోపాటు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నప్రాసన అనేది ఎంతో పవిత్రమైందని దానిని అంగన్వాడి సెంటర్లో నిర్వహిస్తున్నామని ఎందుకు పిల్లల తల్లిదండ్రులు కూడా సాయ సహకారాలు అందించారని తెలిపారు.