Sports & Games

Breaking News

రిమ్స్ లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి

- జిల్లా కలెక్టర్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా 

అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): రిమ్స్ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా  పాలనాధికారి రాజర్షి షా అన్నారు. రిమ్స్ ఆస్పత్రి లోని ఆపరేషన్ థియేటర్లో సిఎస్ఆర్ నిధుల ద్వారా వచ్చిన వివిధ పరికరాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రి కి సి ఎస్ ఆర్ నిధుల ద్వారా 25 లక్షల రూపాయల వస్తువులు రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఆపరేషన్ థియేటర్కు అవసరమైన అన్ని రకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు రాబోయే రోజుల్లో కూడా సి ఎస్ ఆర్ పండింగ్ ద్వారా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ రిమ్స్ సూపరిండెంట్ డాక్టర్ అశోక్, అశ్విన్ కుమార్, ప్రొఫెసర్లు వైద్యులు నర్సింగ్ సిబ్బంది ఆపరేషన్ థియేటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.