Sports & Games

Breaking News

తల్లిపాలలో పోషకాలు పుష్కలం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
తంగడపల్లి, (ఆరోగ్య జ్యోతి): అమ్మ పాలు ఒక అమృతంలా ఉంటాయని పిల్లలందరికీ తల్లిపాలు తాగించడం వల్ల ఆరోగ్యం గా ఉంటారని అన్నారు. తంగడు పల్లి పిహెచ్‌సిఉపకేంద్రం పంతగి గ్రామం లో రెడ్డిబావి, గుండ్లబాసి అంగవాడి సెంటర్ లో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే ముర్రపాలు ను తాగించాలని అది శిశువు జన్మకు శ్రీరామరక్షగా పనిచేస్తుందన్నారు ముర్రపాలలో శరీరానికి అవసరమయ్యే అన్ని విటమిన్స్ మినరల్స్ క్యాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయని తెలిపారు. చాలామందికి ఈ విషయం తెలవక ముర్రపాలను పిండి పారపోస్తారని అది చేయడం తప్పు అన్నారు. ముర్రపాల వల్లనే శిశు శరీరం గట్టిదనం ఏర్పడి రోగనిరోధక శక్తి పెంచుతుందని తెలిపారు. చాలామంది తల్లిపాలు ఇవ్వకుండా డబ్బా పాలు తాపుతారని దీని ద్వారా శిశువు అనారోగ్యాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ శిశువుకు తల్లిపాలు తాగించాలని ఆమె సూచించారు. తల్లిపాలల్లో శిశువుకు అవసరమయ్యే అన్ని రకాల పోషకాహాలు ఉంటాయని పేర్కొన్నారు తల్లిపాల వారోత్సవ సందర్భంగా తల్లిపాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వి. గంగాధర్ ,ఇందిర , గ్రామ సెవాక్ .ధనలక్ష్మి ,అంగవాడి టీచర్లు పారిజాత ,విజయ్ రాణి ,ఆశా సంధ్య ,అయ్యత్ కవిత పాల్గొన్నారు.