అమ్మపాలె పిల్లలకు అమృతం
*తల్లిపాలు పిల్లలకు అమృతం కన్నా విలువైనది
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- అంగన్వాడి కార్యకర్త సరిత
పెగడపల్లి, ములుగు ,(ఆరోగ్య జ్యోతి): అమ్మ పాలే పిల్లలకు అమృతంలా పనిచేస్తాయని అమ్మపాలు తాగించడం వల్ల పిల్లల ఎదుగుదల వేగవంతంగా పెరగటంతో పాటు శ్రీరామరక్షగా పనిచేస్తాయని
ములుగు జిల్లా పెగడపల్లి అంగన్వాడి కార్య కర్త సరిత అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడి సెంటర్లలో తల్లులకు తల్లిపాలపై అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంగన్వాడీ కార్యకర్త సరిత మాట్లాడుతూ అంగన్వాడి సరిత శి సువ్వు జన్మించిన తర్వాత మొదటి గంటలోపు తల్లిపాలను ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత గురించి తల్లులకు వివరించడం జరిగిందన్నారు. శిశువు జన్మించిన వెంటనే ఆ శిశువుకు ముర్రపాలు తాగించాలని అవి ఆయన జీవిత కాలం మొత్తం శ్రీరామరక్షగా పనిచేస్తాయని తెలిపారు ముర్రుపాలు తాగించడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ గట్టిపడటంతో పాటు శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. శిశువును బాధ్యత కుటుంబం మొత్తం తీసుకోవాలి.నవజాత శిశువులకు కేవలం తల్లిపాలు ఇవ్వడంలో కుటుంబ సభ్యులు మరియు తల్లులకి సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుందని పేర్కొన్నారు.పనిచేసే ప్రదేశంలో తల్లిపాలిచ్చే ప్రత్యేక చోటు ఏర్పాటు చేయాలి.కూలీ పనిచేసే ప్రదేశంలో మహిళలకు తల్లిపాలు ఇచ్చే ప్రత్యేకమైన చోటు ఏర్పాటు చేయడానికి మహిళల గౌరవాన్ని హుందాతనాన్ని ప్రోత్సహించదానికి సంస్థల అధిపతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు.తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి చాటే విధంగా కృషి చేయాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సరిత, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.