Sports & Games

Breaking News

పచ్చదనంతోనే ఆరోగ్యం

అదిలాబాద్ (ఆరోగ్య జ్యోతి): పచ్చదనంతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వాడు కౌన్సిలర్ శహనవాజ్ అన్నారు. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రాంనగర్ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్ల నాటడం వల్ల వర్షాలు సకాలంలో పడతాయని పంటలు బాగా పడడంతో పాటు ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయని తెలిపారు. చెట్లు లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణంలో అనేక రకాల మార్పులు వచ్చి వర్షాకాలం ఫుల్ వర్షాలు సక్రమంగా పడక ఎండాకాలంలో వేడి పెరగడం లాంటి సమస్యలు మనం అధిగమిస్తున్నామని అందుకు ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు పెళ్లిరోజు ఇతర శుభకార్యాలలో చెట్లు నాటాలని ఆయన పేర్కొన్నారు. సెల్ ఫోన్లు రావడం వల్ల రేడియేషన్ పెరిగిందని వాతావరణం లో అనేక రకాల మార్పులు వస్తున్నాయని తెలిపారు దీనితో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. గతంతో పోలీసు ప్రస్తుతం అడవుల సంఖ్య తగ్గిందని అందుకు ప్రతి ఇంటి వద్ద అవసరమయ్యే చెట్లు నాటుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోఆఫీసర్  పోశెట్టి, స్పెషల్ ఆఫీసర్ వినోద్, మున్సిపల్ రవీన్ భూమన్న,చైర్మన CH సునీత,ఆశ కార్యకర్త B. సునీత,మెర్ము R.P ధనలక్ష్మి,K.ANW లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు