ఎన్హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్ ను వెంటనే రెగ్యులర్ చేయాలి
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి):
నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల అందర్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వం లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ రెగ్యులర్ అవుతారని ఆశతో ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత రెండు దశాబ్ద ల నుంచి ల్యాబ్ టెక్నీషియన్లు నేషనల్ హెల్త్ మిషన్లో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్ చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టిఎస్ పి ఎస్ సి ద్వారా జారీచేసిన ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల్లో బిఎస్సి ఎమ్మెల్సీ డిఎంఎల్టి చదివిన నిరుద్యోగులను పరిగణలోకి తీసుకోకుండా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధంలేని ఇతర సైన్స్ గ్రూప్ చదివిన వారికి అవకాశం ఇవ్వడం వల్ల లాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి నిజమైన అర్హత కలిగిన వారు ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాల పైగా ల్యాబ్ టెక్నీషియన్లు సేవలందిస్తున్నప్పటికీ ప్రభుత్వం సేవలను గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధినిర్ధారణలో కీలకమైన పారామెడికల్ వైద్యవిద్యను అభ్యాసించి ల్యాబ్ టెక్నాలజీ లో పట్టా పొంది ప్రభుత్వం DSC ద్వారా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ద్వారా కాంట్రాక్ట్ పద్దతి నియమించిందని కానీ ఇప్పటివరకు రెగ్యులర్ చెయ్యలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న వైద్యులకు గత ప్రభుత్వం రెగ్యులర్ చేసిందని అదే రీతిలో ల్యాబ్ టెక్నీషియన్లను కూడా రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు లో గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్న మమ్మల్ని సీనియార్టీని పరిగణలకు తీసుకొని ఇలాంటి రాత పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం నిర్ణయం మీదనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని రెండు దశాబ్దాల కృషికి ఫలితంగా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కరుణించి రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.