బెస్ట్ ఫ్రెండ్స్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
అదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి):పట్టణంలోని బంగారిగూడ లోని ప్రభుత్వం పాఠశాల ఆవరణలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల, కంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం ఉచితంగా మందులను అందజేశారు.జిల్లా కేంద్రంలో స్థానిక నేతాజీ చౌక్ లో గల రీతన్య ఆస్పత్రి డాక్టర్లు డాక్టర్ నివిధేత రెడ్డి చిన్న పిల్లల వైద్యులు,మరియు ఆదర్శ రెడ్డి ల సౌజన్యంతో నిరుపేదల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని..386 మంది,చిన్న పిల్లలకు మరియు పెద్దలు కంటి పరీక్షలు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది.వీరందరికీ ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా రితన్య హాస్పిటల్ డాక్టర్స్ ని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ శాలువాతో సన్మానించడం జరిగింది... ఇలాంటి సామాజహిత కార్యక్రమాలు ముందు ముందు కూడా మరెన్నో నిర్వహించాలని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీఅధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కోరారు... ఈ కార్యక్రమంలో రీతన్య హాస్పిటల్స్ సిబ్బంది, బంగారిగూడ కాలనీవాసులు, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆసిఫ్ , సాబీర్ తది తరులు పాల్గొన్నారు.