ఎడిటర్ కె నరేష్ కుమార్ :9848025452
మంచిరాల్ (ఆరోగ్యజ్యోతి): మంచిర్యాల పట్టణంలోని దీపక్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆదివారం రోజు సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. మందుల నిల్వను పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాలు ప్రసూతి కుటుంబ నియంత్రణ క్షయ తోపాటు అన్ని రకాల వ్యాధులకు అందిస్తున్న చికిత్సలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో ముందుండాలని తెలిపారు సిబ్బందికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. గర్భిణీ అని తెలిసిన వెంటనే రిజిస్టర్ లో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయ్యేవిధంగా వారికి సూచించాలని తెలిపారు. ఆయన వెంట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ వైద్యాధికారి డాక్టర్ మానస, జగన్, అకౌంటెంట్ మోహన్ ఫార్మసిస్ట్ సురేఖ, పావని, ల్యాబ్ టెక్నీషియన్ రేవతి ఏఎన్ఎంలు పద్మ ,భారతి, రాజేశ్వరి, కవిత, లావణ్య, పుష్ప ఎం ఎల్ హెచ్ పి తబిత ఎంఎన్ఓ సమ్మయ్య వాచ్మెన్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.