Sports & Games

Breaking News

సేవలు అందించడంలో టీ- హబ్ సిబ్బంది ముందు ఉండాలి

కే నరేష్ కుమార్ ఎడిటర్ 9848025451

అదిలాబాద్ రిమ్స్,(ఆరోగ్య జ్యోతి): రక్త పరీక్షల కోసం వచ్చిన రోగులకు వెంటనే పరీక్షలు చేయాలని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. టీ హబ్ ను ఆయన సోమవారం రోజు పరిశీలించారు. టీ అబ్బులో పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా కెమికల్స్ అన్నీ ఉన్నాయా రిపోర్ట్స్ ఏ విధంగా ఇస్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలు పూర్తయిన వెంటనే రిపోర్ట్లు తయారుచేసి రోగులకు ఇవ్వాలని తెలిపారు. ఏ విధమైన ఆలస్య అలసత్వం చేయకుండా ఎప్పటికప్పుడు రిపోర్టులో రోగులకు అందజేయాలని తెలిపారు. సమయపాలన పాటిస్తూ సరిగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్లు అందరూ టీ అబ్బును ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిప్పే స్వామి, అశ్విన్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్లు దీక్ష మరియు శారద హబ్ సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు ఉన్నారు