దోషులను కఠినంగా శిక్షించాలి
కే నరేష్ కుమార్ ఎడిటర్ 9848025451
కోల్ కత్తా యువ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలు అత్యాచారం& మర్డర్ ని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని నిన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) పిలుపు మేరకు ఉట్నూర్ ఆసుపత్రి డాక్టర్లు అందరూ & వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలతో పాటుగా యావత్తు వైద్య సిబ్బంది అందరూ కలిసి నిరసన ర్యాలీలు చేపట్టినారు. తోటి డాక్టర్ల సమస్యలను పబ్లిక్ లోకి సానుకూలంగా తీసుకెళ్లి యావత్తు పౌర సమాజం మద్దతు కూడగట్టి మరియు ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొనేలా దేశవ్యాప్తంగా ఉద్యమించిన యావత్తు వైద్య సంఘాలు అన్నింటికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ Dr.ఉపేందర్ జాదవ్ మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని,అలాగే వైద్యులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.