Sports & Games

Breaking News

మెడికో హాస్టల్లో ఇన్ మరియు అవుట్ లను రిజిస్టర్లో విద్యార్థులు తప్పనిసరిగా నమోదు చేయాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో చదువుతున్న మెడికోలు జూనియర్ డాక్టర్లు హాస్టల్ నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా వారి పేరు టైం ఏ పని కోసం బయట వెళ్తున్నాం అనేది రాయాలని మళ్లీ విద్యార్థు విద్యార్థులు హాస్టల్లోకి వచ్చే సమయంలో వచ్చిన సమయాన్ని కూడా రిజిస్టర్లు రాయాలని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. గురువారం రోజు సెక్యూరిటీ ఆఫీస్ వద్ద ఇన్ మరియు అవుట్ రిజిస్టర్ను ఆయన పరిశీలించారు రిజిస్టర్లో సక్రమంగా రాయలేదని సెక్యూరిటీ తప్పనిసరిగా రాయించాలని తెలిపారు బయటకు వెళ్లే సమయం లోపలకు వచ్చే సమయాన్ని కచ్చితంగా సెక్యూరిటీ రాయించాలని తెలిపారు.