Sports & Games

Breaking News

ఆసుపత్రిలో ధరల పట్టికను డిస్ప్లే చేయాలి - కలెక్టర్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ల పేర్లు మాత్రమే ఉండాలి
- అవసరమున్న ఇంతవరకే వైద్యం చికిత్సలు అందించాలి 
- అవసరం లేకున్నా వైద్యస్ చికిత్సల అందిస్తే చర్యలు తప్పవు 
- జిల్లా కలెక్టర్  రాజర్షి  షా 
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాజర్షి  షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీ కృష్ణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఎక్స్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా మలేరియా నివారణ అధికారి ఎన్ సి డి ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్  లుఉన్నారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది వైద్యులు ఉన్నారు. రిజిస్ట్రేషన్ పరిస్థితి ఏంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా ధరలు ఏ విధంగా వేస్తున్నారు. అని ఆసుపత్రి యజమానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి గుర్తింపు ఎలా ఉంది ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ సేవలు ఎలా అందిస్తున్నారు రోగులకు అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అన్ని వార్డ్ లను తిరిగి పరిశీలించారు. ధరల పట్టికను పరిశీలించారు. అలాగే అక్కడ పనిచేస్తున్న వైద్యుల పట్టికను పరిశీలించారు. పట్టికలో కార్డియాలోజి వైద్యుని పేరు ఉంది కానీ అక్కడ ఆయన పని చేయడం లేదు అని తెలియడంతో  అలాంటి పేర్లను తొలగించాలని ఆస్పత్రి యజమానానికి సూచించారు. ఆస్పత్రిలో సేవలు అందించడంలో ముందు ఉండాలని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని వైద్య సేవల కోసం వచ్చిన వారికి తక్కువ బిల్లులు వేయాలని తెలిపారు. బిల్లులు మాత్రం గవర్నమెంట్ నిర్ణయించదని ప్రైవేటు ఆసుపత్రి యజమానులే నిర్ణయిస్తారని తెలిపారు. కానీ పేదలను దృష్టిలో ఉంచుకొని బిల్లులు తక్కువ వేయాలని తెలిపారు.