Sports & Games

Breaking News

విధి నిర్వహణలో ఫోన్ వాడొద్దు... వాడితే కఠిన చర్యలు.. రిమ్స్ ఉద్యోగులందరూ యూనిఫామ్ తప్పనిసరి.. డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- విధి నిర్వహణలో సెల్ ఫోన్ వాడొద్దు 
- ఫోన్ పడితే శాఖ పరమైన చర్యలు తప్పవు 
- యూనిఫామ్ తప్పనిసరి 
- యూనిఫామ్ వేయని వారిపై  చర్యలు తప్పవు 
- రోగి తో రోగి బందులతో మర్యాదగా మాట్లాడాలి 
- ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం 
- సమయపాలన పాటించాలి- విధులు నిర్వహించాలి 
- ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్లు ఎప్పటికప్పుడు వారి వార్డ్, ఓపిని పరిశీలించాలి 

ఆదిలాబాద్ రిమ్స్,(ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ సరిగా విధులు నిర్వహించాలని లేనిపక్షంలో శాఖ పరమైన చర్యలు తప్పవని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ హెచ్చరించారు. విధినిర్వాహణలో సక్రమంగా విధులు నిర్వహించడం లేదని రోజురోజుకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. విధి నిర్వహణలో ఫోన్లు వాడితే చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. మెడికల్ పారామెడికల్ సిబ్బంది రిమ్స్ లో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్లు వాడవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిలో మాత్రం ఫోన్లు వాడాలని తెలిపారు.సిబ్బంది మెడికల్ పారామెడికల్ సిబ్బంది అందరూ రోగులపై శ్రద్ధ చూపటం లేదని సెల్ఫోన్లోని బిజీ బిజీగా ఉంటున్నారని ఇప్పటికి ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. చాలామంది రిమ్స్ లో పనిచేస్తున్న మెడికల్ పారామెడికల్ సిబ్బంది యూనిఫామ్ ధరించడం లేదని కనీసం ఆప్రన్ కూడా వేసుకోవడం లేదని ఫిర్యాదు వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రిమ్స్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన యూనిఫామ్ 100% వేసుకుని రావాలని లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డైరెక్టర్ తెలిపారు. యూనిఫామ్ అనేది మన వృత్తికి సంబంధించిందని మనం యూనిఫామ్ ధరించలేకపోవడం వల్ల మనము ఏం పని చేస్తున్నామో తెలియని పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ టూటర్లు తోపాటు మెడికల్ పారామెడికల్ సిబ్బంది ప్రతి ఒక్కరు యూనిఫామ్ ధరించాల్సిందేనని తెలిపారు.కొందరికి యూనిఫామ్ ఉంటుందని కొందరికి ఆప్రన్ ఉంటుందని తెలిపారు. యూనిఫామ్ లేనట్టయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోగులు రోగులు బంధువులతో సక్రమంగా వ్యవహరించాలని వారు కె అవసరమైన రిపోర్ట్స్ కానీ వైద్యం కానీ సక్రమంగా అందించాలని తెలిపారు. ఒకవేళ ఫిర్యాదులు అందించినట్లయితే వారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ ఉంది అక్కడ ఉంది రిపోర్టు అనకుండా మనకు సమయం ఉంటే వాళ్ళు అక్కడనే నిల్చోపెట్టి రిపోర్టు తెచ్చి తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. రిమ్స్ ఆసుపత్రి అనేది ఒక దేవాలయం లాంటిదని ఎవరి విధులు వారు నిర్వహిస్తే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని తెలిపారు.