Sports & Games

Breaking News

డెంగ్యూ పై దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి -వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ఎడిటర్ కె నరేష్ కుమార్, 9848025451

రూల్స్ బ్రేక్ చేస్తున్న ఏ హాస్పిటల్‌ను వదలొద్దు
-  వైద్య ఆరోగ్యశాఖ  మంత్రి దామోదర రాజనర్సింహ*

హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి): డెంగ్యూ పేరిట దోపిడీ ఎక్కువ అయిందని, ప్రతిరోజు దోపిడి పై ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.  హైదరాబాద్‌లో వైద్య మరియు  ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. రూల్స్ బ్రేక్ చేస్తున్న ఏ హాస్పిటల్‌ను వదలొద్దని స్పష్టం చేశారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి డెంగీ దోడిపీనినియంత్రించాలని, పేషెంట్లు ఫిర్యాదు చేసేందుకు కూడా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వాస్తవ పరిస్థితులను గుర్తించాలన్నారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టియన్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మరియు మిషన్ డైరెక్టర్ ఆర్.వి కర్ణన్ , డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ (డీ.హెచ్) డాక్టర్. రవీందర్ నాయక్ తోపాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు...