Sports & Games

Breaking News

ఆయుష్ వైద్య సేవలను వినియోగించుకోండి

ఎడిటర్ కె నరేష్ కుమార్, 9848025451

ఇచ్చోడ, (ఆరోగ్య జ్యోతి): గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆయుష్ వైద్య శిబిరాలలో వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయుష్ డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ రాథోడ్ ప్రీతల్ అన్నారు. ఇచ్చాడ మండలంలో నిర్వహించిన ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో ఆమె మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆయుర్వేదం ఎంతో గొప్పదని తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో ఆయుర్వేదానికి ఎంతో శక్తి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు అల్లోపతి వైద్యం వైపు మొగ్గుచూపకుండా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఆయుష్ ఆధ్వర్యంలోని ఆయుర్వేద యునాని హోమియోపతి తో పాటు తదితర వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. ఇప్పటికే జిల్లాలోని చాలా గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహించమని విడతల వారీగా అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాటు అనుబంధ గ్రామాల్లో ఉన్న ఆయుష్ వైద్యశాలలను సంప్రదించి చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్వప్న, ఫార్మసిస్ట్ మహేందర్ దేవర, ఎస్సీ ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.