Sports & Games

Breaking News

వైద్యులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు

అదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి): విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై దాడులు చేసే ఊరుకునేది లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమలత అన్నారు. కలకత్తాలో జరిగిన సంఘటన ఎంతో గోరమని ఆమె తెలిపారు. వైద్య విద్యార్థి పై దాడి చేసి చంపడం అనేది మూర్ఖత్వమని తెలిపారు. ప్రభుత్వాలు వెంటనే వైద్యుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొని రావాలని అన్నారు. నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ వైద్యుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులకు పై దాడులు చేయడం నీచమైన చర్య అన్నారు. వైద్యులు ఎంతో గౌరవ వృత్తిలో ఉన్నవారు అని ప్రాణాలు కాపాడే వారిని అలాంటి వారిపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసనీయమని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కే అశోక్, డాక్టర్ రామ, డాక్టర్ గజానంద్, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ హేమలత, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ హేమ, డాక్టర్ లేనా గుజరాతి, డాక్టర్ శ్యామల, డాక్టర్ అరుణ, డాక్టర్ సుష్మ బూష్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సందీప్, తోపాటు తదితరులు పాల్గొన్నారు