Sports & Games

Breaking News

510 జీవో బాధితులకు న్యాయం చేయండి

*510 జి.ఓ.లో నష్టం జరిగిన 4000 వేల ఉద్యోగులకు వెంటనే  న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వనీ  కోరుతున్న  జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా*
 


*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్  లో పనిచేస్తున్న  17,514 అందర్నీ తక్షణమే రెగ్యులర్ చేయాలి.*

 తెలంగాణ రాష్ట్రంలో వివిద శాఖలో ఏ విదంగా అయితే ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనము చెల్లిస్తున్నారో అదే విదంగా జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి, జాతీయ ఆరోగ్య మిషన్లో 2018 నుండి 2024 వరకు అన్ని క్యాడర్ ఉద్యోగులందరికి 510 జి.ఓ. ప్రకారం కొత్త వేతనాలు విడుదల చేయ్యాలి,జాతీయ ఆరోగ్య మిషిన్లో పనిచేస్తున్న ఉద్యోగులు అన్ని అర్హతలు కలిగి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి,జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 30% వెయిటేజ్ మరియు కోవిడ్-19 లో పనిచేసిన ఉద్యోగులకు 20% ఆదనపు వేయిటెజ్ ఇస్తూ ఉద్యోగులను భర్తీ చేయాలి,జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ చేసి వేతనాలు పెంచాలి,గతంలో నాటి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 04-08-2021 నాడు జి.ఓ. 177 లో ఉన్న అన్ని పోస్టులను, నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అన్ని పోస్టులను షాంక్షన్ చేస్తూ రేగ్యులర్ చేయాలి,నేషనల్ హెల్త్ మిషన్ మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి,జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగి వీది నిర్వహణలో మరణిస్తే వారి ఇంట్లో ఒకరికి 6 నెలల లోపు కారుణ్య నియమకం చేయాలి,జాతీయ ఆరోగ్య మిషన్ లో సంవత్సరానికి 35 సాధారణ సెలవులు ఉద్యోగులందరికి మంజూరు చేయాలి,జాతీయ ఆరోగ్య మిషిన్ పెండింగ్లో ఉన్న పి.ఆర్.సి. 7 నెలల ఎరియర్స్ మరియు బకాయిలు వెంటనే చెల్లించాలి,హర్యాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ మరియు మణిపూర్ ఆయా రాష్ట్రాలలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరిని రేగ్యులరైజెషన్ చేశారు. కావున తెలంగాణ రాష్ట్రం కూడ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరిని రేగ్యులరైజెషన్ చేయాలని కోరుచున్నాము.,తెలంగాణ రాష్ట్రంలోని అందరి ఉద్యోగుల ఆరోగ్యానికి మేము రక్షణ అని సేవలందిస్తున్న మా జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్, ఆరోగ్య భీమా ఇవ్వాలి.