Sports & Games

Breaking News

గుండె సంబంధిత వ్యాధులకు భయపడవద్దు

డి ఈ ఐ సి కేంద్రం, కిమ్స్ ఆసుపత్రి వారి సౌజన్యం తో జరిగిన ఉచిత గుండె వైద్య శిభీరానికి విశేష స్పందన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి విచ్చేసిన పేషెంట్స్

*ఆదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి): పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులు వస్తే భయపడవద్దని కిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ వర్మ తెలియజేసారు . ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో డైస్ కేంద్రంలో డాక్టర్ నరేందర్ రాథోడ్  ఆదేశాల మేరకు, డాక్టర్ వైసీ శ్రీనివాస్ సూచనల మేరకు నేడు  0 -18 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె జబ్బులు పిల్లలకు వస్తే భయపడవలసిన అవసరం లేదని 80% వరకు మందులతోనే గుండె జబ్బులు తగ్గుతాయని 20% గుండెజబ్బులు కు ఆపరేషన్ అవసరమవుతుందని తెలిపారు. ఈ సందర్బంగా కిమ్స్ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన పిల్లల నుండి 18 సం పిల్లల వరకు ఉచితంగా ఆపరేషన్ ని ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు వెంట తీసుకుని వచ్చినట్లయితే ఆపరేషన్ అవసరం ఉంటే ఉచితంగా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. చాలావరకు గుండె జబ్బు వచ్చిందంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని భయాందోళనల చెందుతున్నారు ,  అలా భయపడవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కిమ్స్ ఆస్పత్రిలో అన్ని రకాల గుండెజబ్బులకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాదు నుండి రిమ్స్ డైస్ కేంద్రానికి 140 పైగా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఆర్ఎమ్ఓ డాక్టర్ చందు, పిఆర్వోలు సుధాకర్, కిరణ్, డైస్ మేనేజర్ డాక్టర్ రాధిక, అప్థోమాలజీ సనా హుస్సేన్ , దొంతుల ప్రవీణ్, ప్రశాంత్, ఫిజియోథెరపిస్ట్ నాగార్జున రెడ్డి, ఆదిత్య గౌడ్, ఆడియాలజిస్ట్ శ్రీనివాస్ , స్టాఫ్ నర్స్ రాకేష్, ల్యాబ్ టెక్నీషియన్ ఉమాకాంత్, వినోద్ డి ఈ ఐ సి సిబ్బంది తో పాటు వివిధ మండలాల వైద్యులు డాక్టర్ పరహ, డాక్టర్ నరేందర్, ఎం కృష్ణవేణి, డాక్టర్ దినేష్ డాక్టర్ సుజాత, డాక్టర్ స్వప్న, డాక్టర్ సంతోష్, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ నరేష్ , ఫార్మసిస్ట్ ఎం కిషోర్ కుమార్, విజయలక్ష్మి, ఏఎన్ఎం సునీత, తదితరులు పాల్గొన్నారు.