లింగి వృద్ధాశ్రమంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
తలమడుగు ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు వృద్ధులకు ఆయుర్వేద వైద్య శిబిరాన్ని తలమడుగు మండలంలోని సాయిలింగిలో గల వృద్ధాశ్రమంలో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ప్రీతల్ రాథోడ్, ఆయుష్ వైద్య అధికారులు డాక్టర్ వాణి, డాక్టర్ నర్మదా, డాక్టర్ శ్రీకాంత్, ఆధ్వర్యంలో నిర్వహించారు. వృద్ధులకు వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. వ్యాధులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు పాటించాలి తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఆయుర్వేద వైద్యం వల్ల దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధులన్నీ మటుమాయం చేయవచ్చని లింగి ఆశ్రమ వృద్ధులకు వైద్యులు వివరించారు.వృద్ధులకు వచ్చే వ్యాధులు మనం మెదడు మరియు వెన్నుముకకు వచ్చే సమస్యలు కంటి సంబంధిత సమస్యలు వినికిడి కి సంబంధించిన సమస్యలు శ్వాసకోశ సమస్యలు జీర్ణ సమస్యలు కంటి మరియు మూత్ర సమస్యలతోపాటు తదితర వాటికి చికిత్సలు అందించడం జరుగుతుందని వారు వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను ఆయుష్ వైద్య విధానాల ద్వారా సులువుగా చికిత్సలు అందించడం వృద్ధాప్య వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ఆయుష్ శాఖ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆరోగ్య మందిర్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు సాధారణ అనారోగ్య సమస్యలు రక్తపోటు మధుమేహం మోకాళ్ల నొప్పులు తోపాటు అనేక రకాల జబ్బులకు చికిత్సలు అందిస్తారని వారు పేర్కొన్నారు.తొందరగా తగ్గించే ఆయుర్వేద వైద్య మందులను ప్రతి ఒక్కరు వాడాలని తెలిపారు.ఈ వైద్య శిబిరంలో వృద్ధులకు అన్ని రకాల వ్యాధులకు పై అవగాహన కల్పించడంతోపాటు చికిత్సలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో వచ్చే వ్యాధుల కు చికిత్సలు అందజేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ శిబిరంలో వర్షాకాలం వచ్చే వ్యాధులు జాగ్రత్తగా గురించి కూడా వృద్ధులకు అవగాహన కల్పించారు.