- సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోండి
- ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు వైద్య పరీక్షలు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి
సదాశివపేట,(ఆరోగ్యజ్యోతి): సదాశివపేట ఆసుపత్రిలో సూపర్నెంట్ వెంటనే సస్పెండ్ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ , శివ జిల్లా నాయకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏవో శ్రీవారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదాశివపేట ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదని వారందరూ సక్రమంగా విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పై సస్పెండ్ వేయాలని వారు విన్నవించారు సమయపాలన పాటించక ఇష్టమున్న సమయానికి వస్తున్నారని వారు ఆరోపించారు. ఆస్పత్రిలో వైద్యులు వైద్య సిబ్బంది అందరూ సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు.