ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గంగాధర్ కి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు
యాదాద్రి భువనగిరి, (ఆరోగ్య జ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడపల్లి చౌటుప్పల్ పరిధిలో హెల్త్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వి గంగాధర్ కు ఉత్తమ ఉద్యోగిగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవార్డును అందజేశారు. ఈ అవార్డు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చేతుల మీదుగా జనాభా నియంత్రణలో గంగాధర్ కృషి చేసిన దుకాణం ఈ అవార్డును అందజేశారు. జనాభా నియంత్రణ కొరకు తను ఎంతగా కృషి చేశానని అవార్డు తీసుకున్న గంగాధర్ తెలిపారు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ముద్దు అని నినాదంతో కుటుంబ నియంత్రణ శాశ్వతలు చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. జనాభా పెరుగుదలపై ఏమవుతుంది అని ప్రజలకు వివరించారు. జనాభా పెరుగునట్లైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అదే ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని ఎంత చేయించుకోవాలని ప్రచారాన్ని నిర్వహించారు.