Sports & Games

Breaking News

వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగతెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (citu) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము .అందులో భాగంగా అదిలాబాద్ జిల్లావైద్య ఆరోగ్య శాఖ ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  2వ anm, అర్బన్ anm,ec ANM, nhm ఉద్యోగుల,104 ఉద్యోగులు మొదలైన ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కరించాలనీఈరోజు వివిధ uphc/phc లముందు నిరసన తెలియజేయటం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (citu) జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ
గత 16 సం నుండి కాంట్రాక్టు పద్ధతిలో చాలి చాలని వేతనాల తో పనిచేస్తున్నరు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి nhm ఉద్యోగుల కోసం 630 కోట్లు కేటాయించిన బడ్జెట్ ను రిలీజ్ చేయకపోవటం తో ఉద్యోగులకుసకలం లో వేతనాలు అందటం లేదు.అదే విధంగా nhm ఉద్యోగుల యొక్క పెండింగ్ లో ఉన్న ఎరియర్స్ వెంటనే చెల్లించాలి.వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వo వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల  సమస్యలను పరిష్కరించాలి లేనియడల రానున్న రోజుల్లో మొత్తం వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉదృతం చేస్తామని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (citu) గా డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో పుష్పాల,ఆనంద బాయి, తులసి, ప్రశాంత్ దేశ్పండే,కిరణ్,సురేందర్,శ్రీనివాస్,దేవుబాయ్,
లక్మి,పుష్ప, రమాదేవి,అన్నపూర్ణ,దత్తు, సునీతా,
మొదలైన వారు పాల్గొన్నారు


డిమాండ్స్

1. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న 17,000 మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. జీఓ నెం.510 అమలు కాని కేడర్లకు వెంటనే అమలు చేయాలి.

2. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను, 2వ ఏఎన్ఎం, అర్బన్ ఏఎన్ఎం, ఇసిఎఎన్ఎం, హెచఆర్డి ఏఎన్ఎం, 104 ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలి. పిఆర్సి బకాయిలు చెల్లించాలి.

3. 104 ఉద్యోగులకు ఏజెన్సీ ద్వారా కాకుండా 300 ఓసిఎస్ ద్వారా వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలి.

4. టివివిపి, డిఎంఇ, డిహెచ్ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్స్ ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి.

5.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పేషంట్ కేర్, శానిటేషన్, స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్లకు కనీస వేతనంరూ.26,000/-లు ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తున్న వేతనంలో పిఎఫ్ వాటాలలో యజమాని వాటా ప్రభుత్వమేచెల్లించాలి. 

6. ఆరోగ్యశ్రీ సిబ్బందికి కేడర్ మార్పు చేసి వేతనం పెంచాలి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ విధానం రద్దు చేయాలి.

7. టివివిపి అటానమస్ రద్దు చేయాలి. 010 వేతనాలు, హెల్త్ కార్డులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్, నర్సింగ్ ఆఫీసర్స్ ప్రమోషన్స్ సమస్యలు పరిష్కరించాలి.

8. 2024లో రిక్రూట్ అయిన నర్సింగ్ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరించాలి.

9.జీఓ నెం.317 ద్వారా ఏర్పడిన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. జీఓ నెం. 142ను రద్దు చేయాలి.

10. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెలా మొదటి వారంలో జీతాలు చెల్లించాలి.

11. 108, 102 ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.

12. ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

13. కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.

14. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ని రద్దు చేయాలి.

15. కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000/-లు నిర్ణయించాలి.

16. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.

17. ఈపిఎఫ్ చెల్లింపులో జాప్యం చేసిన వారికి జరిమానాలను తగ్గించడాన్ని ఉపసంహరించుకోవాలి.

18. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాలి.

19. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

20. ఈపిఎస్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ.9,000/-లకు తగ్గకుండా చెల్లించాలి.