ఎన్ హెచ్ ఎం 510 జీవో లో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయండి
- కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కలిసిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు
*కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి):నేషనల్ హెల్త్ మిషన్(ఎన్ హెచ్ ఎం) పనిచేయుచున్న దాదాపు 17వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని తెలంగాణ ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఎన్ హెచ్ ఎం డైరెక్టర్ ఆర్.వీ.కర్ణన్ యూనియన్ ప్రతినిధులతో చర్చించి దానితో నేడు యూనియన్ ప్రతినిధులు ఎన్ హెచ్ ఎం డైరెక్టర్ ను కలిసి నేటి నుండి చెయ్య తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు అదే విధంగా మిగతా జీతాలు ప్రతినెలా 5 వ తేదీ లోపు జీతాలు అందే విధంగా చూస్తానని ఆర్ వి కర్ణన్ కమిషనర్ హామీ ... పి.ఆర్.సి సందర్భంగా రావలసిన ఏడు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నరసింహ వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితిని గమనించి రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు సమకూర్చి ఉద్యోగులకు జీతాలు చెల్లించినందుకు వారికి అభినందిస్తూ పుష్ప గుచ్చం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ 510 జీవోలో అన్యం జరిగిన వాళ్లందరికీ న్యాయం చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగుల బాలసుబ్రమణ్యం , రాష్ట్ర ఎన్ హెచ్ ఉపాధ్యక్షులు సరికొండ సురేష్ గౌడ్ , ఆయుష్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ .శ్రీనివాస్ , లోకేష్ , న్యూట్రిషన్ కౌన్సిలర్ గణేష్, జ్యోతి, వరలక్ష్మి, టీ.బీ. అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమశేఖర్, రాజు, తదితరులు పాల్గొన్నారు...