Sports & Games

Breaking News

జూలై 10న దేశవ్యాప్తంగా "కోర్కెల దినం" సందర్భంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని కేంద్రాల్లో నిరసనలు

తెలంగాణ బ్యూరో,(ఆరోగ్య జ్యోతి):2024 జూలై 10న దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో "కోర్కెల దినం" పాటించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు భూపాల్,ఎండి. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఫసియొద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. యాదానాయక్ లు
పిలుపునిచ్చింది. మన రాష్ట్రంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పిహెచ్సీల నుండి జనరల్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల వరకు అన్ని కేంద్రాల్లో డిమాండ్తో కూడిన ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలపాలని, కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగులందరూ పాల్గొనాలని, అలాగే జిల్లా, మండల కేంద్రాల్లో సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ధర్నాల్లో పాల్గొంటారని తెలియజేస్తున్నాం. కేంద్రంలో బిజెపి పరిపాలించిన కాలం 2014 నుండి 2024 వరకు వైద్య రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించడానికి ప్రయత్నించింది. వైద్య రంగానికి బడ్జెట్ పెంచకుండా, రాష్ట్రాలకు సరిపడా నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టింది. మన రాష్ట్రానికి సుమారు రూ.630 కోట్లు ఎన్హెచ్ఎం బడ్జెట్ విడుదల చేయకుండా స్కీములను, ఉద్యోగులను ఇబ్బందులపాలు చేసింది. 3వ సారి అధికారంలోకి వచ్చాక కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నది. నీట్ పరీక్షల్లో లీకేజీలకు పాల్పడి 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలాగాటమాడింది. కనీస వేతనం రూ.26,000/-ల అమలు, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పర్మినెంట్, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం హయ్యర్ పెన్షన్ చెల్లింపు, ఓపిఎస్ రద్దు, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తింపు వంటి అంశాలపై కేంద్ర బిజెపి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ కొనసాగిస్తున్నది. విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు అవలంభిస్తున్నది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వైద్య ఆరోగ్య ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్, ఔట్సోర్సింగ్ విధానం రద్దు, పిఆర్సి వేతనాలు పెంపుదల, రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రమోషన్లు, బదిలీలు, 317 జీఓ సమస్యలు, 142 జీఓ రద్దు. ఎనోచ్ఎం, 104, 108, 102, ఆరోగ్యశ్రీ, టిసాక్స్, ఆయుష్ తదితర స్కీములలో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా సమస్యలుఎదుర్కొంటున్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.కేంద్ర బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే కార్యక్రమాలలో ఉద్యోగులు పాల్గొంటారని తెలియజేస్తున్నాము.

డిమాండ్స్

1. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న 17,000 మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. జీఓ నెం.510 అమలు కాని కేడర్లకు వెంటనే అమలు చేయాలి.

2. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను, 2వ ఏఎన్ఎం, అర్బన్ ఏఎన్ఎం, ఇసిఎఎన్ఎం, హెచఆర్ ఏఎన్ఎం, 104 ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలి. పిఆర్ సి బకాయిలు చెల్లించాలి.

3. 104 ఉద్యోగులకు ఏజెన్సీ ద్వారా కాకుండా 300 ఓసిఎస్ ద్వారా వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలి.

4. టివివిపి, డిఎంఇ, డిహెచ్ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్స్ ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి.

5. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పేషంట్ కేర్. శానిటేషన్, స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్లకు కనీస వేతనం రూ.26,000/-లు ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తున్న వేతనంలో పిఎఫ్ వాటాలలో యజమాని వాటా ప్రభుత్వమే చెల్లించాలి.

6. ఆరోగ్యశ్రీ సిబ్బందికి కేడర్ మార్పు చేసి వేతనం పెంచాలి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ విధానం రద్దు చేయాలి.

7. టివివిపి అటానమస్ రద్దు చేయాలి. 010 వేతనాలు, హెల్త్ కార్డులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్, నర్సింగ్ ఆఫీసర్స్ ప్రమోషన్స్ సమస్యలు పరిష్కరించాలి.

8. 2024లో రిక్రూట్ అయిన నర్సింగ్ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరించాలి.

9. జీఓ నెం.317 ద్వారా ఏర్పడిన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. జీఓ నెం.142ను రద్దు చేయాలి.

10. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెలా మొదటి వారంలో జీతాలు చెల్లించాలి.

11. 108, 102 ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.

12. ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

13. కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.

14. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి. నేషనల్ మానిటైజేషన్ పైడ్లైనిని రద్దు చేయాలి.

15. కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000/-లు నిర్ణయించాలి.

16. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి - సమాన వేతనం ఇవ్వాలి.

17. ఈపిఎఫ్ చెల్లింపులో జాప్యం చేసిన వారికి జరిమానాలను తగ్గించడాన్ని ఉపసంహరించుకోవాలి.

18. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాలి.

19. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

20. ఈపిఎస్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ.9,000/-లకు తగ్గకుండా చెల్లించాలి.