Sports & Games

Breaking News

వర్షాకాలం వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ఇంద్రవెల్లి పిట్ట బొంగరం (ఆరోగ్య జ్యోతి): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాలను తీసుకెళ్లడంలో సిబ్బంది ముందుండాలని ట్రైబల్ అడిషనల్ డీఎం డాక్టర్ మనోహర్ డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాధనలు అన్నారు. పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని సూచించారు. గర్భిణీ అని తెలిసిన వెంటనే వేరు నమోదు చేయడంతో పాటు ఆన్లైన్లో కూడా నమోదు చేయాలని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నెల నెల చేయాలని తెలిపారు అంతేకాకుండా ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే విధంగా మోటివేషన్ చేయాలని తెలిపారు ప్రతి రోగిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఐ రిస్క్ ఏఎన్సీ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించాలని వర్షాకాలం కావడం వల్ల ప్రతి గ్రామాల్లో ఆశా కార్యకర్త వద్ద ఆరోగ్య కార్యకర్త వద్ద మందులు నిల్వలు ఉంచాలని తెలిపారు గ్రామాల్లో పారిశుద్ధంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు ఎన్సిడితోపాటు పాఠశాలల్లో కూడా వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు ఆర్ బి ఎస్ కె టీం ఆరోగ్య శిబిరాల్లో కూడా పాలుపంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఆర్ ప్రదీప్ నాయక్, సూపర్వైజర్లు, హెచ్ ఈ ఓ లు , ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎం లు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.